Hong Kong: ఛలో చైనా... ఫ్రీగా...!

Hong Kong: ఛలో చైనా... ఫ్రీగా...!
చైనా టూరిజం పెపొందించేందుకు కీలక నిర్ణయం: ఉచితంగా 5లక్షల టికెట్లు ప్రకటంచిన హాంకాంగ్....

కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే బయట ప్రపంచానికి తలుపులు తెరచిన చైనా... టూరిస్టులను ఆకర్షించేందుకు భారీ ప్రణాళికలే రచిస్తోంది. ఇందులో భాగంగా 5లక్షల ఫ్లైట్ టికెట్లను ఉచితంగా పంపిణీ చేయబోతోందట. క్యాథీ పసిఫిక్, హాంకాంగ్ ఎక్స్ ప్రెస్, హాంకాంగ్ ఎయిర్ లైన్స్ సంస్థల ద్వారా ఈ ఉచిత టికెట్లను అందుబాటులోకి తీసుకు రాబోతోంది.

మార్చ్ నుంచి ఈ టికెట్లు లభ్యమవ్వనున్నాయని తెలుస్తోంది. హాంకాంగ్ అధికార ప్రతినిథి ఈ మేరకు ఓ ప్రకటనను విడదల చేశారు. వాణిద్య రాజధానిలో పర్యాటకులను, వ్యాపారవేత్తలను, పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ ఈ భారీ ఆఫర్ ను ప్రకటించారు.

హెల్లో హాంకాంగ్ పేరిట ప్రారంభించనున్న ఈ కార్యక్రమం ద్వారా చైనా గురించిన మంచి కథలను విశ్వవ్యాపితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా వల్ల పూర్తిగా దెబ్బతిన్న వాణిద్యాన్ని పునరుత్తేజ పరిచేందుకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని తెలుస్తోంది. అంతేకాదు.

ఐసోలేషన్, క్వారెంటైన్ వంటి కరోనా నియమ నిబంధనలు పాటించబోవడంలేదని స్పష్టం చేసింది. 2022లోనూ ఇదే విధంగా సుమారు 6లక్షల ఉచిత టికెట్లు జారీ చేసింది. అయితే 2018తో పోల్చుకుంటే పర్యాటకుల సంఖ్య ఒక్కశాతం కన్నా తక్కువేనని చెప్పాలి.

గత మూడేళ్లలో సుమారు 130 అంతర్జాతీయ సంస్థలు హాంకాంగ్ లో తమ కార్యాలయాను మూసివేశాయి. తాజా సర్వే ప్రకారం 253 జపనీస్ సంస్థలు అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగస్థులను కైవసం చేసుకోవడం చైనా ఇబ్బందిగా మారిందన్నది జగమెరిగిన సత్యం. ఇక సుమారు లక్షా 40వేల మంది లేబర్ ఫోర్స్ నుంచి తప్పుకోవడంతో ఆర్ధిక వ్యవస్థ 3.5శాతానికి పడిపోయింది.

Tags

Read MoreRead Less
Next Story