Horse: 30 వేల అడుగుల ఎత్తులో గందరగోళం చేసిన గుర్రం

Horse: 30 వేల అడుగుల ఎత్తులో  గందరగోళం చేసిన గుర్రం
బోనులోంచి తప్పించుకున్న గుర్రం

కార్గో విమానంలో తరలిస్తున్న ఓ గుర్రం బోను నుంచి తప్పించుకుని విమానంలో అటూఇటూ తిరగడంతో సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. ఎయిర్ అట్లాంటా ఐస్‌లాండిక్ విమానంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుచూసింది. న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే విమానాశ్రయం నుంచి బెల్జియంకు ఇటీవల బోయింగ్ 747 కార్గో విమానం బయలుదేరింది. అందులో గుర్రాన్ని తరలిస్తుండగా విమానం బయలుదేరిన అరగంట తర్వాత బోను లోంచి తప్పించుకున్న గుర్రం బయటకు వచ్చి అటూఇటూ తిరిగింది.

బోయింగ్‌ 747 కార్గో విమానం గత వారం న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెల్జియం బయలు దేరింది. ఆ కార్గోలో ఓ గుర్రాన్ని తరలిస్తున్నారు. అయితే, విమానం టేకాఫ్‌ అయిన 30 నిమిషాల తర్వాత బోనులో నుంచి గుర్రం తప్పించుకుని విమానంలో అటూ ఇటూ తిరగడం మొదలు పెట్టింది. గుర్రం ఒక్కసారిగా బోను నుంచి బయటకు రావడంతో సిబ్బంది హడలిపోయారు. ఆ సమయంలో విమానం భూమికి 30 వేల అడుగుల ఎత్తులో ఉంది.

ఈ విషయాన్ని వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సమాచారం అందించారు. అధికారుల అనుమతితో విమానాన్ని వెనక్కి మళ్లించి తిరిగి న్యూయార్క్‌ విమానాశ్రయంలోనే ల్యాండ్‌ చేశారు. కాగా, తిరుగు ప్రయాణంలో విమానం బరువు ఎక్కువగా ఉండటంతో 20 టన్నుల ఇంధనాన్ని అట్లాంటిక్‌ సముద్రంలో పారబోయాల్సి వచ్చింది. అయితే, గుర్రం బోను నుంచి ఎలా తప్పించుకున్నది తెలియరాలేదు.

గుర్రం ఒక్కసారిగా బోను నుంచి దూకడంతో సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే విషయాన్ని ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. విమానాన్ని వెనక్కి మళ్లించి తిరిగి న్యూయార్క్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. కాగా, విమానం వెనక్కి వస్తున్న సమయంలో బరువు ఎక్కువగా ఉన్న కారణంగా 20 టన్నుల ఇంధనాన్ని అట్లాంటిక్ మహా సముద్రంలో పారబోసినట్టు సిబ్బంది తెలిపారు. అసలు గుర్రం ఆ క్రేట్ నుంచి ఎలా తప్పించుకుందో ఇంకా తెలియలేదు. అయితే, విమానాశ్రయంలో విమానం దిగేప్పటికి గుర్రం అదుపులో లేదు.

Tags

Read MoreRead Less
Next Story