California: కాలిఫోర్నియాలో భయపెడుతున్న రాకాసి అలలు

California: కాలిఫోర్నియాలో భయపెడుతున్న రాకాసి అలలు

కాలిఫోర్నియాలో మూడు రోజులుగా తీర ప్రాంతాల్లోని నివాసాలపై రాకాసి అలలు ఎగసిపడుతుండడంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. అలలు 20 నుంచి 40 అడుగుల ఎత్తులో విరుచుకుపడుతుండడంతో స్థానికులు నివాసాలను ఖాళీ చేస్తున్నారు. అలల దాటికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. వెంచురాలో సముద్రపు అలలు 10 మందిని లోపలికి ఈడ్చుకెళ్లాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వారిని కాపాడారు. అలల తాకిడి కారణంగా మరో 8 మంది ఆసుపత్రి పాలయ్యారు. పలు వాహనాలు కొట్టుకుపోయాయి.

అలలు పెద్దఎత్తున ఎగసిపడుతుండడంతో అధికారులు తీర ప్రాంతాలను మూసివేశారు. వెంచురా కౌంటీ తీర ప్రాంతంలో రక్షణ గోడను దాటిమరీ అలలు ఎగసిపడుతున్నాయి. గురువారం నుంచి చాలాచోట్ల పరిస్థితి ఇలానే ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. తుపాను ప్రభావం కారణంగానే అలలు ఎగసిపడుతున్నట్టు తెలుస్తోంది.

నేషనల్ వెదర్ సర్వీస్ అధికారులు అలలు 28 నుంచి 33 అడుగుల ఎత్తులో ఎగసిపడే అవకాశం ఉందని, కొన్ని చోట్ల 40 అడుగుల ఎత్తులో కూడా అలలు ఎగసిపడే అవకాశం ఉందని చెప్పారు.ఇప్పటికే సముద్రానికి సమీపంలోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయని వెల్లడించారు.కెరటాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మరికొద్ది రోజుల్లో వాతావరణం మరింత దిగజారవచ్చు.సముద్రంలో తుఫాను భూమికి దగ్గరగా కదులుతోంది.ఇది ముఖ్యంగా దక్షిణ కాలిఫోర్నియాలో అలలను పెద్దదిగా, బలంగా చేస్తుంది. శాన్ డియాగో అనే నగరంలో, అలలు శనివారం అతిపెద్దవిగా ఉంటాయి.మరో నగరం లాస్ ఏంజెల్స్ కూడా అలల ప్రమాదంలో ఉంది.శనివారం రాత్రి 10 గంటల వరకు లాస్ ఏంజెల్స్ ప్రజలు అలలు, వరదల పట్ల జాగ్రత్తగా ఉండాలని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story