Hurricane Idalia: అమెరికాలో హరికేన్ బీభత్సం

Hurricane Idalia: అమెరికాలో హరికేన్ బీభత్సం
ఫ్లోరిడాను కకావికలం చేసిన మూడో కేటగిరీ హరికేన్‌ ఇడాలియా... గంటకు 215 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు

ఐడాలియా తుపాను(Hurricane Idalia) అమెరికాను వణికిస్తోంది. అగ్రరాజ్యంలోని ఫ్లోరిడా(Florida ), జార్జియాల్లో ఇడాలియా(destruction in Florida and Georgia) హరికేన్‌ బీభత్సం సృష్టించింది. గంటకు 215 కిలోమీటర్ల వేగంతో(215 kilometers) కూడిన గాలులతో ఫ్లోరిడాలో తీరం దాటిన ఇడాలియా పెను విధ్వంసం(extremely dangerous ) సృష్టించింది. ఈ తుఫాను ప్రభావంతోఫ్లోరిడా వ్యాప్తంగా భీకర గాలులు, కుండపోత వర్షం కురిసింది. భీకర గాలులకు వృక్షాలు కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. అనేక ఇళ్లు, హోటళ్లు పైకప్పులు ఎగిరిపోయాయి. దాదాపు 5 లక్షల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.


మూడో కేటగిరీగా గుర్తించిన హరికేన్‌ ఇడాలియా(Category 3 storm) అమెరికాలోని ఫ్లోరిడాను కకావికలం చేసింది. పెను వేగంతో విరుచుకుపడిన ఇడాలియా ధాటికి చిన్నచిన్నకార్లు పడవల మాదిరి కొట్టుకుపోయాయి. జార్జియాలోని రోడ్లపైకి వరద నీరు చేరింది. కీటన్‌ బీచ్‌ సమీపంలో భూమ్మీదకొచ్చిన ఇడాలియా తుపాన్‌ గంటకు 205 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో తీరంపై విరుచుకుపడింది. తర్వాత తుపానుగా బలహీనపడిన హరికేన్‌ గంటకు 113 కిలోమీటర్ వేగంతో కూడిన గాలులతో పయనం సాగిస్తోంది.

ఇడాలియా హరికేన్‌ ప్రభావంతో జార్జియాలో ఒకరు మృతిచెందారు. ఫ్లోరిడాలో అధికారికంగా ఎలాంటి మృతులను ప్రకటించలేదు. కొన్నిచోట్ల రహదారులపై ప్రమాదాలు సంభవించాయి.అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతంలో తీరందాటలేదు కాబట్టి ప్రాణనష్టం జరగలేదని భావిస్తున్నారు. ఫ్లోరిడాలోని గ్రామీణ ప్రాంతాల మీదుగానే ఇడాలియా తీరం దాటింది. హరికేన్ ప్రభావం వల్ల విద్యుత్ లైన్లు దెబ్బతిని ఫ్లోరిడా, జార్జియాల్లో 5లక్షల మంది వినియోగదారులకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. అనేక దుకాణాలు, భవనాలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు పలు అంతరాష్ట్ర రహదారులపై వరద చేరింది.


ఇడాలియా తుపానుపై వాతావరణ విభాగం నుంచి సమాచారం ఉండడంతో అనేక కౌంటీలు ప్రజలు రోడ్లపైకి రాకుండా కర్ఫ్యూ విధించాయి. స్టైన్‌హాచీ ప్రాంతంలో వ్యాపారాలు, బోట్ డెక్‌లు మునిగాయి. సెడార్‌ కీ ద్వీపంలోనూ అనేక చెట్లు నెలకూలాయి. ఫలితంగా రహాదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. 5,500 మంది నేషనల్‌ గార్డ్స్‌, సహాయ సిబ్బంది.. లోతట్టు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టారు. విరిగిపడిన వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు తొలిగించే పనులు.... చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నష్టం జరిగినందున సహాయ చర్యలు పూర్తిచేసేందుకు సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story