Mexico: మెక్సికోలో హరికేన్‌ ఓటిస్‌ బీభత్సం..

Mexico: మెక్సికోలో హరికేన్‌ ఓటిస్‌ బీభత్సం..
నీట మునిగిన అకాపుల్కో నగరం.39 మంది మృతి

అకాపుల్కో హరికేన్ విధ్వంసం వల్ల మెక్సికో దేశంలో 39 మంది మరణించారు. ఈ తుపాన్ విపత్తు వల్ల మరో 10 మంది గల్లంతయ్యారు. ఈ తుపాన్ వల్ల విద్యుత్, నీరు, టెలిఫోన్ సౌకర్యాలు దెబ్బతిన్నాయి. ఓటిస్ హరికేన్ వల్ల 27 మంది మరణించారు. ప్రస్థుత అకాపుల్కో తుపాన్ వల్ల 10 మంది మహిళలు, 29 మంది పురుషులు మరణించారని భద్రతా కార్యదర్శి రోసా ఐసెలా రోడ్రిగ్జ్ చెప్పారు.

మెక్సికో లో ఓటిస్ తుపాను తీరం దాటే సమయంలో బీభత్సం సృష్టించింది. తుపాను తాకిడికి అకాపుల్కో నగరంలో 27 మంది మరణించగా నలుగురు గల్లంతయ్యారు. మరణించిన వారిలో చాలా మంది పొంగిపొర్లుతున్న వరదలో కొట్టుకుపోయారని అధికారులు తెలిపారు. గంటకు 165 మైళ్ళ వేగంతో వీచిన గాలులకి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. దాదాపు 9 లక్షల జనాభా ఉన్న అకాపుల్కోనగరం పూర్తిగా నీట మునిగింది. కాగా ఓటిస్ మెక్సికో తీరాన్ని తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాను అని అధికారులు తెలిపారు. సైన్యం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతోందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పర్యాటకానికి కేంద్ర బిందువైన అకాపుల్కోలో తుపాను కారణంగా చాలా హోటళ్లు దెబ్బతిన్నాయి. అలాగే సల్గాడో నగరంలోని 80 శాతం హోటళ్లు తుఫానుతో నష్టపోయాయని, విద్యుత్తును పునరుద్ధరించడానికి, తాగునీటి సరఫరాకు కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.


మృతులను ఇంకా గుర్తించలేదు. తుపాన్ అనంతరం సూపర్ మార్కెట్లలో దోపిడీలు సాగుతుండటంతో 10వేలమంది భద్రతా బలగాలను మోహరించారు. మెక్సికన్ సైనికులు, నావికాదళం ఉద్యోగులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. రిసార్ట్ నగరంలో ప్రజలకు మంచినీరు, ఆహార సామాగ్రిని పంపిణీ చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. వాతావరణశాఖ హెచ్చరికల కంటే తుపాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఇది అత్యంత భారీ తుపానుగా మెక్సికో దేశ చరిత్రలో నిలిచిపోయింది. రిసార్టు నగరంలో చిక్కుకున్న పర్యాటకులను కాపాడేందుకు సైనికబలగాలు యత్నిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story