Iceland: ఐస్‌ల్యాండ్‌లో విస్ఫోటనం చెందిన అగ్నిపర్వతం

Iceland: ఐస్‌ల్యాండ్‌లో విస్ఫోటనం చెందిన అగ్నిపర్వతం
మూడు నెలల్లో నాలుగోసారి!

ఐస్‌ల్యాండ్‌లోని హగాఫెల్, స్టెరి-స్కాగ్ఫెల్ మధ్య ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో లావా విస్ఫోటనం చెందుతోంది. ఇక్కడ అగ్నిపర్వతం బద్దలవడం మూడు నెలల్లో ఇది నాలుగవసారి. అగ్నిపర్వతం నుంచి కాంతివంతమైన కాషాయ రంగులో ఉన్న లావా, పెద్ద ఎత్తున పొగలు గాల్లోకి ఎగసిపడ్డాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.


చూడగానే అబ్బురపరుస్తున్న ఈ దృశ్యం ఒక అగ్నిపర్వత విస్ఫోటనానిది. పశ్చిమ ఐలాండ్‌లోని గ్రిండవిక్‌ పట్టణ శివార్లలో అగ్నిపర్వతం బద్దలై ఇలా నిప్పులు చిమ్ముతున్నది. అగ్నిపర్వతం నుంచి ఎర్రటి లావా పొగలు కక్కుతూ ప్రవహిస్తున్నది. ఐలాండిక్‌ కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది ఈ చిత్రాన్ని కెమెరాలో బంధించారు.

ఐస్ లాండ్ లోని అగ్ని పర్వతం మరోసారి అగ్ని కీలలను, భారీగా లావాను వెదజల్లుతోంది. ఈ అగ్నిపర్వతం ప్రజ్వరిల్లడం ఈ సంవత్సరం లో ఇది4 వ సారి. ప్రస్తుతం ఈ అగ్ని పర్వతం నుంచి లావా పశ్చిమ దిశగా పయనిస్తోందని, గ్రిండావిక్ కు ప్రస్తుతానికి ఏ ప్రమాదం లేదని ఐస్ లాండ్ వాతావరణ శాఖ తెలిపింది. 2021 నుండి ఈ అగ్ని పర్వతం నుంచి లావా భారీగా బయటకు రావడం ఇది ఏడోసారి. ప్రస్తుతం సుమారు 80 మీటర్ల (260 అడుగులు) ఎత్తు వరకు లావా ప్రజ్వరిల్లుతోంది. ఐస్ ల్యాండ్ లోని సిలింగర్‌ఫెల్ అగ్ని పర్వతం నుంచి లావా వెలువడుతున్న ఏరియల్ వ్యూ దృశ్యం. ఐస్‌ల్యాండ్‌లోని గ్రిండావిక్‌కు ఉత్తరాన ఈ అగ్నిపర్వతం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story