అంతర్జాతీయం

ఇమ్రాన్ ఖాన్ విధానాలతో విసుగెత్తిపోయిన పాకిస్తానీలు..!

అప్పుడేమో అంతన్నారు.. ఇంతన్నారు. కానీ ఇప్పుడేమో పొమ్మంటున్నారు. దేశాన్ని ఏలడమంటే వికెట్లు తీసినంత ఈజీ కాదంటూ చురకలు పెడుతున్నారు.

ఇమ్రాన్ ఖాన్ విధానాలతో విసుగెత్తిపోయిన పాకిస్తానీలు..!
X

అప్పుడేమో అంతన్నారు.. ఇంతన్నారు. కానీ ఇప్పుడేమో పొమ్మంటున్నారు. దేశాన్ని ఏలడమంటే వికెట్లు తీసినంత ఈజీ కాదంటూ చురకలు పెడుతున్నారు. సైన్యం, విపక్షాలు, ప్రజలు.. ఎవరికీ అక్కర్లేదంట! మరి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ పరిస్థితి ఏమిటి? ఆయన విధానాలతో పాకిస్తానీలు ఎందుకు విసుగెత్తిపోయారు? సైన్యానికి చిరాకొస్తే.. ఇమ్రాన్ ప్లేసులోకి రాబోయేది ఎవరు? అసలు ఆయనకు ఎందుకీ పరిస్థితి వచ్చింది?

2018లో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఇమ్రాన్ ఖాన్.. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడానికే భయపడుతున్నారు. ఐదు చోట్ల పోటీ చేసి.. ఐదు చోట్లా నెగ్గిన ట్రాక్ట్ రికార్డ్ ఆయనకుంది. కానీ ఇప్పుడు పోటీ అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. నయా పాకిస్తాన్ నినాదం.. ఆయనకు ఎలా నెగటివ్ గా మారింది? మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయాలకు సెలవు ప్రకటిస్తారా? సైన్యమే బలవంతంగా దింపేసే వరకు ఆగుతారా? పాకిస్తాన్ లో పరోక్షంగా ఆర్మీ చేతుల్లో పగ్గాలు ఉంటాయి. అలాంటప్పుడు ఇమ్రాన్ ఖాన్ పై ఎందుకు వ్యతిరేకత పెరుగుతోంది? తేడా ఎక్కడ వచ్చింది?

టెర్రరిజాన్ని నమ్ముకున్న ఇమ్రాన్ ఖాన్ దేశాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే ప్రశ్న. చెప్పాలంటే ఆ దేశ ప్రజల మనసుల్లోనూ ఇదే ప్రశ్న ఉంది. అందుకే అక్కడి విపక్షాలకు మద్దతు పెరుగుతోంది. సైన్యం కూడా ఇమ్రాన్ పక్షం నుంచి తప్పుకుంటున్నట్టే కనిపిస్తోంది. 7 నెలల్లోనే 670 బిలియన్ డాలర్ల అప్పు చేసిన ఇమ్రాన్ ప్రభుత్వం.. దానిని ఎలా తీరుస్తుంది? మరిప్పుడు పాకిస్తాన్ కు దిక్కెవరు? ప్రజల మనసులో ఉన్నదెవరు?

మనం దేశంపై విషం కక్కినంత సులభం కాదు.. పాకిస్తాన్ ను అక్కడి నాయకులు పరిపాలించడం. భారత్ ను అడ్డుపెట్టుకుని బతికేద్దామనుకున్నారు. ఇప్పుడు సొంత ప్రజల చేతుల్లోనే ఛీ అనిపించుకుంటున్నారు. ఇప్పటికైనా మీ బుద్ధి, మీ ధోరణి, మీ నైజం మార్చుకోండి. ముందు జనరంజకంగా, అభివృద్ధి చేసేలా పరిపాలించడం నేర్చుకోండి. వాళ్ల బతుకులను ఉద్ధరించండి. ఇమ్రాన్ ఖాన్.. ఇప్పటికైనా అర్థమయ్యిందా? ప్రజల నమ్మకాని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో! ముందు ఆ పనేదో చూడండి.

Next Story

RELATED STORIES