CHINA: "భారత్‌" పేరుపై విషం చిమ్మిన చైనా

CHINA: భారత్‌ పేరుపై విషం చిమ్మిన చైనా
జీ 20ను భారత్‌ ప్రతిష్ఠకు వేదికగా భావిస్తుందని అక్కసు... ఇతర ముఖ్యమైన విషయాలపై దృష్టి సారించాలన్న డ్రాగన్‌...

ఇండియాకు బదులు భారత్ పేరు వాడకంపై చైనా అక్కసు వెళ్లగక్కింది. అంతర్జాతీయ స్థాయిలో తన ప్రభావాన్ని పెంచుకునేందుకు జీ-20 వేదికను భారత్ అవకాశంగా మలుచుకోవాలని కోరుకుంటున్నట్లు విమర్శించింది. పేరు కంటే ఇతర ముఖ్య విషయాలపై దృష్టి సారించాలని చైనా ప్రభుత్వం అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనంలో విషం చిమ్మింది. స్వాతంత్ర్యానికి ముందు నుంచి ఉన్న ఆర్థిక వ్యవస్థను భారత్ సంస్కరణల మార్గంలో నడిపించగలదా అన్నదే ముఖ్యమని చైనా పేర్కొంది. విప్లవాత్మక సంస్కరణలు అమలు చేయకుండా భారత్ అభివృద్ధి సాధించలేదని తెలిపింది. అంతర్జాతీయంగా ఉన్న సానుకూల పరిస్థితులను అభివృద్ధికి చోదకశక్తిగా మార్చుకోగలదని ఆకాంక్షిస్తున్నట్లు చైనా తెలిపింది. జీ-20 సదస్సు ద్వారా ఢిల్లీ కేవలం వలసవాదంగా భావిస్తున్న పేరును తొలగించే ప్రయత్నంగా కనిపిస్తోందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.


ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు సన్నాహాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లోనే ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని వార్తలు ఊపందుకు]న్నాయి. ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సమ్మిట్ జరగబోతున్న సంగతి తెలిసింది. ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న ఈ కార్య క్రమంలో జీ20 దేశాధినేతలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 9న విందు ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా విందు కోసం రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రికలను పంపించింది. అయితే ఈ ఆహ్వాన పత్రికల్లో 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా'కు బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని పేర్కొన్నారు. దీనిపై దేశ వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. భారత్ అనే పదాన్ని అందరికీ అలవాటు చేయాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఇటీవల పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం సంభవించడం ప్రాధాన్యం సంతరించుకుంది.


రాష్ట్రపతి భవన్ పంపిన డిన్నర్ ఇన్విటేషన్ లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా పేర్కొనడంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం మన దేశం పేరును భారత్ గా పిలవాల్సి ఉంటుందన్నారు. పేరు మార్చినప్పటికీ సమాఖ్య వ్యవస్థపై దాడి కొనసాగుతూనే ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. చరిత్రను వక్రీకరించడం, భారతదేశాన్ని విభజించడాన్ని మోదీ కొనసాగిస్తున్నారని, పేరు మార్పు కాదు భారత్ లో స్నేహం, సయోధ్య, నమ్మకాన్ని తీసుకురావడం ముఖ్యమని పేర్కొన్నారు. ఈ ఆరోపణలను కేంద్రమంత్రులు, భారత జనతా పార్టీ నేతలు తిప్పికొట్టారు.

Tags

Read MoreRead Less
Next Story