సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన న్యూజిలాండ్ ఎంపీ..

సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన న్యూజిలాండ్ ఎంపీ..
ఇటీవల జరిగిన న్యూజిలాండ్ ఎన్నికల్లో ప్రధాని జెసిండా ఆర్డెర్న్ నేతృత్వంలోని లేబర్ పార్టీ మరోసారి విజయం

న్యూజిలాండ్‌లో పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన డాక్టర్ గౌరవ్ శర్మ, న్యూజిలాండ్ దేశీయ భాష అయిన మౌరీతో పాటు భారతదేశం నుండి వచ్చిన శాస్త్రీయ భాష అయిన సంస్కృతం లో ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన న్యూజిలాండ్ ఎన్నికల్లో ప్రధాని జెసిండా ఆర్డెర్న్ నేతృత్వంలోని లేబర్ పార్టీ మరోసారి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున భారత సంతతి యువ వైద్యుడు గౌరవ్ శర్మ విజయం సాధించారు.

రాజకీయవేత్తగా మారిన డాక్టర్ శర్మ హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్పూర్ జిల్లాకు చెందినవారు. అధికార లేబర్ పార్టీ అభ్యర్థిగా హామిల్టన్ వెస్ట్ నుంచి ఆయన ఎన్నికల్లో విజయం సాధించారు. అతను నేషనల్ పార్టీకి చెందిన టిమ్ మాకిండోను 4,386 ఓట్ల తేడాతో ఓడించారు. ప్రమాణ స్వీకారం కోసం హిందీని ఎంచుకోకుండా సంస్కృతాన్ని ఎంచుకోవడం వెనుక గల కారణం ఏమిటని ఒక ట్విట్టర్ యూజర్ అడిగినప్పుడు.. డాక్టర్ శర్మ నా మాతృభాష పంజాబీలో చేయాలనుకున్నాను.. కానీ భారతీయ భాషలలో సంస్కృతం అర్ధవంతమైంది. అందుకే దానిని నేను ఎంచుకున్నాను. అంతేకాదు సంస్కృత భాషని దేవతల భాష అని కూడా అంటారు. అయినా ప్రతి ఒక్కరినీ సంతోషంగా ఉంచడం కష్టం అని ట్విట్టర్ యూజర్‌కి సమాధానం ఇచ్చారు గౌరవ్.

న్యూజిలాండ్ పార్లమెంటులో సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన భారత సంతతికి చెందిన మొదటి సభ్యుడు మరియు విదేశాలలో సంస్కృతంలో ప్రమాణం చేసిన ప్రపంచంలో రెండవ రాజకీయ నాయకుడు డాక్టర్ శర్మ. సురినామ్ భారత సంతతి అధ్యక్షుడు చంద్రిక ప్రసాద్ సంతోకి జూలైలో సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story