మైనర్ బాలికకు ముద్దు పెట్టడంతో.. ఆమె అతడిపై..

మైనర్ బాలికకు ముద్దు పెట్టడంతో.. ఆమె అతడిపై..
ఇన్‌స్టాగ్రామ్‌లో బాలికను కలిసిన చెల్లం..

విదేశాల్లో చట్టాలు కఠినంగా ఉంటాయని తెలిసినా వంకర బుద్ది చూపాడు.. ఇప్పుడు లబో దిబో మంటున్నాడు భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి. సింగపూర్‌లో నివసిస్తున్న ఓ భారతీయుడు 15 ఏళ్ల బాలికను ముద్దుపెట్టుకుని, ఆమెపై లైంగిక చర్యకు పాల్పడడంతో అక్కడి చట్టాలు అతడిని కఠినంగా శిక్షించాయి. ఈ కేసుపై మంగళవారం తీర్పు చెప్పిన కోర్టు ఏడు నెలల కఠినకారాగార శిక్ష విధించినట్లు మీడియా నివేదిక తెలిపింది. బాలికను కలిసిన చెల్లం రాజేష్ కన్నన్ (26) ఆమెపై రెండుసార్లు లైంగిక చర్యకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడు. గత సంవత్సరం ఇన్‌స్టాగ్రామ్‌లో బాలికను కలిసిన చెల్లం ఇప్పుడు ఆమెను సంప్రదించి ఒక అభ్యర్థన పంపినట్లు కోర్టు విన్నది.

చెల్లంకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా బాలికతో పరిచయం పెంచుకున్నాడు చెల్లం. అనంతరం మరోసారి కలుసుకున్నారు. అప్పుడు ఆమె తన స్నేహితుల కోసం మధ్యం తీసుకురమ్మని చెల్లంను అభ్యర్ధించింది. దాంతో అతడు ఆమెకు మద్యం తెచ్చి ఇచ్చి వెళుతూ ముద్దు ఇమ్మని అడిగాడు బాలికను. అందుకు ఆమె తిరస్కరించింది. మద్యం అడిగితే తెచ్చి ఇచ్చానని బలవంతం చేశాడు.. ఆపై లైంగిక చర్యకు బలవంతం చేశాడు.

దీంతో బాలిక అతడి నుంచి తప్పించుకుని పోలీసులకు చెల్లంపై ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు చెల్లంను అరెస్ట్ చేశారు. సింగపూర్ చట్టాలు కఠినంగా ఉంటాయి. బాలికను లైంగికంగా వేధించినందుకు గాను అతడికి కఠినంగా శిక్ష విధించింది. గత మూడేళ్లలో అతడు మరే ఇతర నేరాలకు పాల్పడకపోయినా తీర్పు అతడికి వ్యతిరేకంగా వచ్చింది. ఇంతకు ముందు భద్రతా సిబ్బందికి సంబంధించిన విధులు నిర్వర్తించేవాడు. తనకు విధించిన శిక్షను గురించి వివరిస్తూ చెల్లం.. ఇందుకు నేను చాలా పశ్చాత్తాప్పడుతున్నాను. "నేను ఈ కేసులో చాలా బాధలను ఎదుర్కొన్నాను. ఉద్యోగం కోల్పోయాను, నా కుటుంబాన్ని, నా భార్యని, నా (రెండేళ్ల) కుమార్తెను కోల్పోయాను ... మాది ప్రేమ వివాహం. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నాము.

బాధితురాలిపై చెల్లం "ఒత్తిడి మరియు బలవంతం" చేసినందున కఠినమైన శిక్ష విధించాలని జిల్లా జడ్జి షాన్ హో అన్నారు. ఈ సంవత్సరం ఆగస్టు 18 న అతని రిమాండ్ తేదీకి ఈ శిక్షను ఖరారు చేశారు. ఒక యువకుడి లైంగిక దోపిడీకి, అతనికి 10,000 డాలర్ల వరకు జరిమానా లేదా ఐదేళ్ల వరకు జైలు శిక్ష లేదా రెండూ ఉండవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story