China ship: మాల్దీవులకు చైనా నిఘా నౌక

China ship: మాల్దీవులకు చైనా నిఘా నౌక
గమనిస్తున్నామన్న భారత నేవీ అధికారులు

భారత్‌తో దౌత్య వివాదం నడుస్తున్న వేళ మాల్దీవుల ప్రభుత్వం తాజాగా మరోసారి రెచ్చగొట్టే చర్యకు పూనుకొంది. భారత్‌తో మాల్దీవుల వివాదం వేళ పరిశోధన నౌకగా చెప్పే చైనా నిఘా నౌక ఒకటి మాల్దీవుల దిశగా ప్రయాణం సాగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. హిందూ మహా సముద్రంలోని తమ తీర జలాల్లో చైనా నిఘా నౌకను నిలిపేందుకు అనుమతిచ్చింది. సిబ్బంది రొటేషన్‌, ఇతర అవసరాలకోసమే ఈ నౌకకు ఆశ్రయం ఇస్తున్నామని.. మిత్ర దేశాలకు చెందిన వాహనాలను ఎల్లప్పుడూ స్వాగతిస్తామని వ్యాఖ్యానించింది.

చైనాకు అనుకూలంగా ఉండే మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు భారత్‌తో గిల్లికజ్జాలు కోరుకుంటున్న విషయం తెలిసిందే. భారత్‌పైనా, ప్రధాని మోదీపైనా మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు రాజేసిన విషయం విదితమే. ఇదే సమయంలో ఈ చైనీస్‌ నౌక జావా-సుమత్రా మధ్య ఉండే సుండా జలసంధిని దాటిన తర్వాత ప్రస్తుతం హిందూ మహాసముద్రం రీజియన్‌లోని ఇండోనేషియా తీరంలో ప్రయాణిస్తున్నదని మైరెన్‌ ట్రాకర్‌ యాప్‌ వెల్లడించింది. ఈ షిప్‌ ఫిబ్రవరి 8న మాల్దీవులకు చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ చైనా గూఢచారి నౌక హిందూ మహాసముద్ర జలాల్లో 2019, 2020లలో సర్వే చేసిందని భౌగోళిక నిపుణుడు డామియెన్‌ సైమన్‌ పేర్కొన్నారుచైనా నుంచి బయల్దేరిన ఈ నౌక ఫిబ్రవరి 8న మాల్దీవులకు చేరుకోనుంది. ఇటీవల భారత ప్రధాని మోదీపై మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముదు ఆ దేశాధ్యక్షుడు ముయిజ్జు మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని వెళ్లిపోవాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఇప్పుడు ఏకంగా చైనాకు చెందిన నిఘా నౌక షియాన్‌ యాంగ్‌ హాంగ్‌-3ను మాల్దీవులు అనుమతించింది. భారత్‌లోని కొన్ని ప్రాంతాలు, నౌకాశ్రయాలు, గగనతలంపైనే కాక అణు ప్లాంట్లపైనా ఓ కన్నేసి ఉంచగల అధునాతన పరికరాలతో కూడిన ఇలాంటి నౌకను చైనా గత ఏడాది శ్రీలంక తీరంలో నిలిపేందుకు ప్రయత్నించగా భారత్‌ అభ్యంతర పెట్టింది. దీంతో అనుమతి లభించలేదు. కాగా, 2019లో భారత జలాల్లోకి చైనా నౌక అక్రమంగా ప్రవేశించగా.. దానిని భారత దళాలు వెనక్కుపంపాయి. షియాన్‌ యాంగ్‌ హాంగ్‌-3ను నిఘా నౌకగా చూడొద్దని భారత్‌ను చైనా కోరింది.

Tags

Read MoreRead Less
Next Story