Australian Senator: పార్లమెంటు సాక్షిగా భగవద్గీతపై ప్రమాణం చేసిన ఆస్ట్రేలియా సెనేటర్

Australian Senator: పార్లమెంటు సాక్షిగా భగవద్గీతపై ప్రమాణం చేసిన ఆస్ట్రేలియా సెనేటర్
అభినందించిన ప్రధాని, విదేశాంగ మంత్రి

ఆస్ట్రేలియాలోని భారతీయ సంతతికి చెందిన సెనేటర్ వరుణ్ ఘోష్ భగవద్గీతపై ప్రమాణం చేశారు. భారత సంతతికి చెందిన న్యాయవాది వరుణ్ ఘోష్ ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో కొత్త సెనేటర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా భగవద్గీతపై ప్రమాణం చేశారు. అస్ట్రేలియా పార్లమెంటులో ప్రమాణం చేసిన మొదటి వ్యక్తి ఘోష్ కావడం విశేషం. ఈయన ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆరోగ్య కారణాల వల్ల పదవీ విరమణ చేయబోతున్న సెనేటర్ పాట్రిక్ డాడ్సన్ స్థానంలో వరుణ్ ఘోష్ ఎంపికయ్యారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఘోష్‌కు అభినందనలు తెలిపారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌ శుభాకాంక్షలు తెలిపారు. “పశ్చిమ ఆస్ట్రేలియా నుండి మా కొత్త సెనేటర్ వరుణ్ ఘోష్‌కు స్వాగతం. సెనేటర్ ఘోష్ భగవద్గీతపై ప్రమాణం చేసిన మొదటి ఆస్ట్రేలియా సెనేటర్ అంటూ పెన్నీ వాంగ్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు.


ఈ సందర్భంగా వరుణ్ ఘోష్ మాట్లాడుతూ.. నేను మంచి విద్యను పొందడం నా అదృష్టం. అదే స్థాయిలో నాణ్యమైన విద్య, శిక్షణ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని గట్టిగా నమ్ముతున్నానని, ఆమేరకు కృషి చేస్తానని చెప్పారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా (డబ్ల్యూఏ)కి ప్రాతినిధ్యం వహించడానికి లేబర్ పార్టీ వరుణ్ ఘోష్ ను ఎంపిక చేసింది. ఇటీవలే ఫ్రాన్సిస్ బర్డ్ ఛాంబర్స్ లో న్యాయవాది అయిన 38ఏళ్ల ఘోష్.. ప్రస్తుతం సెనేటర్ పాట్రిక్ డాడ్సన్ స్థానంలో పార్లమెంట్ లో కొత్త సెనేటర్ గా ఎంపికయ్యాడు. పశ్చిమ ఆస్ట్రేలియా శాసనసభ, ఫెడరల్ పార్లమెంట్ సెనేట్ లో పశ్చిమ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించడానికి లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ సెనేటర్ వరున్ ఘోష్ ను ఎన్నుకున్నాయి. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వరుణ్ ఘోష్ కు శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ ఆస్ట్రేలియా నుంచి మా సరికొత్త సెనేటర్ ఘోష్ కు స్వాగతం. మీరు మా బృందంలో ఉండటం అద్భుతం అని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అదేవిధంగా ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ వరుణ్ ఘోష్ కు లేబర్ సెనేట్ బృందంలోకి స్వాగతం పలికారు.

వరుణ్ ఘోష్ 1985లో జన్మించారు. 1997లో పెర్త్ కు వెళ్లి క్రైస్ట్ చర్చ్ గ్రామర్ స్కూల్ లో విద్యనభ్యసించాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం నుంచి కళలు, న్యాయశాస్త్రంలో డిగ్రీలను అందుకున్నాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో కామన్వెల్త్ స్కాలర్. వరుణ్ గతంలో న్యూయార్క్ లో ఫైనాన్స్ అటార్నీగా, వాషింగ్టన్, డీసీలో ప్రపంచ బ్యాంకు సలహాదారుగా పనిచేశాడు. వరుణ్ ఘోష్ యొక్క రాజకీయ ప్రయాణం ఫెర్త్ లోని ఆస్ట్రేలియా లేబర్ పార్టీలో ప్రారంభమైంది. వరుణ్ ఘోష్ కు 17ఏళ్ల వయస్సులోనే లేబర్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story