Uber cab: ఉబర్ ఎక్కించుకొని దేశం దాటించేశాడు

Uber cab: ఉబర్ ఎక్కించుకొని దేశం దాటించేశాడు
అమెరికాలోకి ఇండియన్లు అక్రమ రవాణా, భారత సంతతి వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష

ఉబర్ ఎక్కితే ఒక ఊరు నుంచి మరో ఊరు వెళతారు. కానీ ఏకంగా దేశాన్ని దాటించేసాడు వ్యక్తి. ఎలాంటి కాయితాలు, వీసాలు లేకుండా జాగ్రత్తగా కెనడా నుంచి యుస్ కి తెచ్చేసాడు. చివరికి యూ ఎస్ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.

అమెరికన్ నుంచి కెనడాకు వెళ్లడం, అటు నుంచి ఇటు రావటం చాలా ఈజీ. ఎందుకంటే నయాగరా వాటర్ ఫాల్ కి అటు కెనడా ఇటు అమెరికా. కొన్ని చిన్న చిన్న ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటే చాలు దేశం మారచ్చు అలా చూసి రావచ్చు. కానీ కాలిఫోర్నియాలో నివసించే 49 ఏళ్ల రాజిందర్ పాల్ సింగ్ అలియాస్‌ జస్పాల్ గిల్ దానిని మిస్ యూస్ చేసుకున్నాడు. కొందరు స్నేహితులతో కలిసి ఉబర్‌ క్యాబ్‌ సేవల ద్వారా 800 మంది భారతీయులను అక్రమంగా అమెరికాలోకి తరలించాడు. ఐదు లక్షలకు పైగా అమెరికా డాలర్లను అక్రమ పద్ధతుల్లో సంపాదించాడు. ఈ నేరానికిగాను ఆ వ్యక్తికి మూడేళ్లకుపైగా జైలు శిక్షను అమెరికా కోర్టు విధించింది.

కాగా, 2018 జూలై నుంచి 2022 మే వరకు రాజిందర్ పాల్ సింగ్ ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. కెనడా నుంచి ఉత్తర సరిహద్దు మీదుగా సీటెల్‌తోపాటు వాషింగ్టన్‌ స్టేట్‌లోని పలు ప్రాంతాలకు ఉబర్‌ క్యాబ్‌ల ద్వారా భారతీయులను అక్రమంగా తరలించాడు. నాలుగేళ్లలో 600కు పైగా ఉబర్‌ ట్రిప్‌లను వినియోగించాడు. ఈ నేరాలకు సంబంధించి 17 ఉబర్‌ ఖాతాలను అమెరికా పోలీసులు గుర్తించారు. భారతీయుల అక్రమ తరలింపునకుగాను ఈ ఖాతాల్లో 80,000కు పైగా అమెరికా డాలర్లను ఛార్జీలుగా వసూలు చేసినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. అతని ఇంటిని సోదా చెయ్యగా 45,000 అమెరికా డాలర్లతో పాలు పలు ఫొర్జరీ పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతను వాషింగ్టన్‌కు భద్రతాపరమైన ముప్పు కలిగించినట్లు కోర్టు ఆరోపించింది. అలాగే అమెరికాలోకి అక్రమంగా స్మగ్లింగ్‌ చేసిన భారతీయులను కూడా అతడు ముప్పులోకి పడేసినట్లు పేర్కొంది. మనీలాండరింగ్‌ అభియోగాలకు కూడా పాల్పడినట్లు ఆరోపించింది. తన నేరాన్ని ఒప్పుకున్న సింగ్‌కు కోర్టు 45 నెలలు జైలు శిక్ష విధించింది.

Tags

Read MoreRead Less
Next Story