Intuitive Machines: చంద్రుడు కక్ష్యలోకి చేరిన ప్రైవేట్ అమెరికా అంతరిక్ష నౌక

Intuitive Machines: చంద్రుడు కక్ష్యలోకి చేరిన ప్రైవేట్ అమెరికా అంతరిక్ష నౌక
50 ఏళ్ల తర్వాత చంద్రుడిపై అడుగుపెట్టిన లూనార్ ల్యాండర్

దాదాపు 50 ఏళ్ల తర్వాత అమెరికాకు చెందిన ఓ ప్రైవేట్ లూనార్ ల్యాండర్ చంద్రుని వద్దకు చేరుకుంది. అమెరికా కంపెనీ ‘ఇంటూటివ్ మెషీన్స్‌’కు చెందిన తొలి లూనార్ ల్యాండర్ ‘ఒడిస్సియస్’ చంద్రునిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఫ్లోరిడాలోని నాసా ‘కెన్నెడీ స్పేస్ సెంటర్’ నుంచి గత గురువారం ఈ ప్రయోగాన్ని చేపట్టారు. స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌ ద్వారా అంతరిక్ష నౌకను ప్రయోగించారు. ఐఎం-1 (IM-1) పేరుతో ఈ మిషన్‌ను నిర్వహించారు. ప్రైవేటు కంపెనీ ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ చంద్రుడిపైకి పంపించిన మొట్టమొదటి రోబోటిక్ ఫ్లైట్ ఇదే కావడం గమనార్హం.

ల్యాండర్ ఒడిస్సియస్ అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 6:23 గంటల సమయంలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగింది. నాసా, ఇతర కమర్షియల్ కంపెనీలకు చెందిన పరికరాలను ఒడిస్సియస్ చంద్రుడిపైకి మోసుకెళ్లింది. కాగా అమెరికాకు చెందిన చివరి మూన్ ల్యాండింగ్ మిషన్ 1972 డిసెంబర్‌లో జరిగింది. 1972లో NASA వ్యోమగాముల అపోలో ప్రోగ్రామ్ తరువాత, దాదాపు 50 సంవత్సరాలకు మొదటిసారిగా అమెరికా చంద్రునిపై ప్రైవేట్ లూనార్ ను విజయవంతంగా ప్రవేశపెట్టగలిగింది. అంతకు ముందు అమెరికా చేసిన ఏ ప్రయత్నాలూ ఫలించలేదు. ఫిబ్రవరి 15న స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ -9 రాకెట్ తో ఆరు కాళ్లున్న లూనార్ ల్యాడర్ ఒడిస్సియస్ ను ప్రయోగించారు. దీనిని ఐఎమ్-1 ల్యాండర్ అని కూడా పిలుస్తారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వాణిజ్య కార్యక్రమం లూనార్ పేలోడ్ సర్వీస్ కింద ఈ ప్రయోగం చేపట్టారు. దీనికోసం ఇంట్యూటివ్ మెషీన్స్ తో మొత్తం 18 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీన్ని మొదట ఫిబ్రవరి 14న ప్రయోగించాలనుకున్నారు. కానీ, మిథేన్ ఉష్ణోగ్రతలో మార్పు కారణంగా సాంకేతిక సమస్య తలెత్తడంతో ఫిబ్రవరి 15న మిషన్ ప్రారంభించారు.


ఇంటూటివ్ మెషీన్స్ ల్యాండర్ భూమితో సంబంధాలు తెగిపోయి.. కక్ష్యలోకి చేరే క్రమంలో రాకెట్ థ్రస్టర్ ను ఏడు నిమిషాల పాటు మండించారు. ల్యాండర్ కక్ష్యలో ఉందో లేక లక్ష్యం లేకుండా దూసుకుపోతుందో తెలుసుకోవడానికి కంపెనీ హ్యూస్టన్ ప్రధాన కార్యాలయంలోని ఫ్లైట్ కంట్రోలర్‌లు కొంత సమయం వరకు వేచి ఉండాల్సి వచ్చింది.ఐఎమ్-1 ల్యాండర్ మిషన్ 16 రోజుల మిషన్. చంద్రుడి మీద దిగిన తరువాత 7 రోజులు పనిచేస్తుంది.

చంద్రుడి ఉపరితల పరస్పర చర్యలు, వాతావరణ చర్యలు, రేడియో ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలు ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ల్యాండింగ్ టెక్నాలజీ, కమ్యూనికేషన్, నావిగేషన్‌కు సంబంధించిన సామర్థ్యాలపై కూడా పరిశీలనలు చేయనున్నట్టు నాసా రిపోర్టులు చెబుతున్నాయి. కాగా చంద్రుడిపై పరిశోధనల కోసం పలు అమెరికా కంపెనీలతో నాసా కలిసి పనిచేస్తోంది.


Tags

Read MoreRead Less
Next Story