2వేల అడుగుల ఎత్తు నుంచి పడిన ఫోన్.. తీరా చూస్తే..

2వేల అడుగుల ఎత్తు నుంచి పడిన ఫోన్.. తీరా చూస్తే..
ఎర్నెస్టో.. గాలియోట్టో అనే విమానంలో ప్రయాణిస్తున్నాడు.

ప్రకృతి అందాలను కెమెరాలో బంధించాలనుకున్నాడు.. 2వేల అడుగుల ఎత్తులో ఉన్నా కనువిందు చేస్తున్న ప్రకృతి సోయగాలకు పరవశించి పోయి తాను తీయేబోయే డాక్యుమెంట‌్‌కు పనికొస్తాయని ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు.. అంతలోనే అది చేజారి కింద పడిపోయింది. అయినా ఆ ఫోన్ ఏ మాత్రం డ్యామేజ్ కాకపోగా కెమెరా అలానే ఆన్‌లో ఉండి రికార్డవుతూ ఉంది. బ్రెజిల్‌కు చెందిన ఎర్నెస్టో పర్యావరణ వేత్త మరియు చిత్ర నిర్మాత కూడా.

ఆయన రియో డి జనీరో యొక్క అద్భుతమైన తీరాన్ని చిత్రీకరించి షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నాడు. అందుకోసం ఎర్నెస్టో.. గాలియోట్టో అనే చిన్న విమానంలో ప్రయాణిస్తున్నాడు. చేతిలో ఫోన్ తీసుకుని కిటికీ పక్కన కూర్చుని వీడియో తీస్తున్నాడు. ఇంతలో చేతిలో ఉన్న ఫోన్ జారి 2వేల అడుగుల ఎత్తులో నుంచి కిందపడిపోయింది. ఫోన్ పడి పోవడంతో ఒక్క క్షణం బాధపడ్డాడు.. అలా ఎలా జారవిడుచుకున్నాను అని తన మీద తనకే కోపం కూడా వచ్చింది.

కానీ మైండ్‌లో ఎక్కడో ఓ మూల తన ఫోన్ సురక్షితంగానే ఉండి ఉంటుంది అని అనిపించింది అతడికి. దాంతో ఫోన్ ల్యాండ్ అయిన అనంతరం ఫోన్ పడిపోయిన ప్రదేశానికి వెళ్లాడు.. అక్కడ జీపిఎస్ ఆన్ చేసి చూశాడు ఫోన్ పనిచేస్తుందో లేదో చెక్ చేద్దామని. విచిత్రంగా ఫోన్ యాక్టివ్ మోడ్‌లోనే ఉంది.. ఫోన్ ఉన్న ప్రాంతానికి వెళ్లి చూస్తే మైనర్ డ్యామేజ్ తప్పించి మేజర్‌గా ఏమీ కాలేదని ఊపిరి పీల్చుకున్నాడు. దీంతో పాటు వీడియో కూడా ఆన్‌లోనే ఉండడంతో ఈ ప్రమాదం మొత్తం రికార్డయింది. కేవలం 15 సెకన్లలోనే ఫోన్ నేల మీద పడినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story