Iran : మళ్ళీ హిజాబ్ గస్తీలు

Iran : మళ్ళీ హిజాబ్ గస్తీలు
ఇరాన్‌ వీధుల్లో నైతిక పోలీసులు

ఇరాన్‌లో మొరాలిటీ పోలీసులు మళ్లీ రోడ్లపైకి వచ్చారు. కొంతకాలంగా కనుమరుగైన ఈ పోలీసులు తిరిగి వీధుల్లో దర్శనమిచ్చారు. ఇస్లామిక్‌ సంప్రదాయమైన హిజాబ్‌ను ప్రతి మహిళ తప్పనిసరిగా ధరించాలంటూ ఇరాన్‌ ఆదివారం ప్రకటించగా మహిళలు ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నారా లేదా అన్నది పర్యవేక్షించడమే వీరి పని.

హిజాబ్ ధరించలేదని ఓ యువతని దారుణంగా కొట్టడంతో గతేడాది మహిళల ఆందోళనలతో ఇరాన్ దద్దరిల్లిపోయింది. అప్పట్లో నైతిక పోలీస్ విభాగాన్ని రద్దు చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసనలు తగ్గుముఖం పట్టాయి. కానీ ఇప్పుడు అధికారులు మరోసారి బహిరంగ ప్రదేశాల్లో మహిళల డ్రెస్ కోడ్ పై నిఘా గస్తీ నిర్వహించడం మొదలుపెట్టారు. మహిళల బట్టలు శిరోజాలను కత్తిరించుకున్నారా, ఉంచుకున్నారా అనే అంశాలను వారు పరిశీలిస్తున్నారని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. గత కొంతకాలంగా ఇరాన్లోని మతతత్వవాదులు హిజాబ్ ను స్త్రీలు తప్పనిసరిగా ధరించేలా చూసేందుకు గస్తీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో వీటిని పునరుద్ధరించినట్టుగా సమాచారం.


ఇరాన్ సాధారణంగా పరిషియా చట్టాన్ని అనుసరిస్తుంది. ఇందులో మహిళలు ఖచ్చితంగా తమ శిరోజాలను హిజాబుతో కప్పి ఉంచాలి. అలాగే శరీరానికి బిగువుగా, పట్టి ఉండే దుస్తులను కాకుండా పొడవాటి వదులైన వస్త్రాలను ధరించాలి. కారులో వెళ్తున్నప్పుడు కూడా వారు తమ జుట్టును కవర్ చేసుకునే కనపడాలి. ఈ అంశాలు అమలయ్యేలా దేశంలోని నైతిక పోలీసు విభాగం పర్యవేక్షిస్తుంది. 2005లో ఈ భాగాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక ప్రత్యేక పోలీసు విభాగం. 1979 ఇస్లామిక్ విప్లవం తరువాత ఇరాన్‌లో మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి చేయబడింది. గత కొంత కాలంగా ఇరాన్ ప్రభుత్వం టెక్నాలజీ సాయంతో డ్రెస్ కోడ్ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఒక్కానొక సమయంలో కెమెరాల సహాయం కూడా తీసుకున్నారు.

పబ్లిక్ ప్రాంతంలో తన తలను సరిగ్గా కప్పుకోలేదన్న కారణంతో 22 ఏళ్ల మహసా అమినీ అనే అమ్మాయి, పోయిన ఏడాది సెప్టెంబర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె పోలీసుల కస్టడీలో మరణించారు. మహసా అమినీ మరణం తర్వాత ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. ఈ ఆందోళనలను చెదరగొట్టేందుకు, ఆపేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నించింది.మహిళలు, జీవితం, స్వేచ్ఛ అనే నినాదాలతో వారి నిరసనలు కొనసాగాయి. నిరసనల్లో భాగంగా చాలా మంది మహిళలు తమ హిజాబ్‌ను తీసేసి, మంటల్లో కాల్చివేశారు. ఇంకొంత మంది మహిళలు తమ జుట్టును పబ్లిక్ ప్రదేశాల్లోనే కత్తిరించుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story