భార్య మెలానియా నుంచి ట్రంప్‌కి మరో షాక్?

భార్య మెలానియా నుంచి ట్రంప్‌కి మరో షాక్?

అమెరికా అధ్యక్ష ఫలితాలు స్పష్టంగా వచ్చినా.. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌ మాత్రం మంకు పట్టు వీడటంలేదు.. ఇంకా తన ఓటమిని అంగీకరించలేకపోతున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని ప్రకటనలు చేస్తున్నారు. ఆయనకు తగ్గట్టుగానే.. ఆయన అభిమానులు కూడా... ట్రంప్‌ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. కొన్ని చోట్ల ఆయన మద్దతుదారులు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. దిస్ ఈజింట్‌ ఓవర్‌... ఇది ఇంకా పూర్తి కాలేదంటూ... ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

తన ఓటమిని ట్రంప్‌ అంగీకరించలేకపోతున్నా.. పలువురు మాత్రం... గౌరవంగా తప్పుకోవాలని సూచిస్తున్నారు. ఇలా నచ్చజెపుతున్నవారిలో ఆయన అల్లుడు సీనియర్ సలహాదారులు అయిన జరేడ్‌ కుష్నర్‌ ఒకరు. ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. వాటిని అంగీకరించాలని జరేడ్ కుష్నర్ సూచిస్తున్నారు. అయితే ట్రంప్‌ మాత్రం.. కోర్టులో తనకు తగిన మెజారిటీ రాలేదని నిరూపితమైన తర్వాతే ఒప్పుకుంటానని ట్రంప్ తెగేసి చెబుతున్నారు. రిపబ్లికన్ పార్టీ నేతలు, శ్వేత సౌధం అధికారులు కూడా... అధికార మార్పిడి సవ్యంగా జరిగేలా సహకరించాలని సూచిస్తున్నారు.

ఓ వైపు సొంత పార్టీ నేతలు.. అల్లుడు జరేడ్ చెబుతున్నా.. ట్రంప్‌కు మద్దతు ఇచ్చేవారు కూడా భారీగా ఉన్నారు. ఆయన ఇద్దరు కుమారులు డొనాల్డ్ జూనియర్‌, ఎరిక్‌లు న్యాయ పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. తండ్రికి అండగా ఉండాలని... రిపబ్లికన్ పార్టీ శ్రేణుల్ని కోరుతున్నారు. కొందరు మద్దతుదారులు కూడా దీనికి సై అంటున్నారు. బైడెన్‌ అక్రమంగా విజయం సాధించారని దేశంలో సగం మంది నమ్ముతున్నారని.. ఆయన ఆర్థిక సలహాదారు రోజర్ స్టోన్ అంటున్ననారు.

అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పరాభవం వెంటాడుతున్నసమయంలో... డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిగత జీవితంలో అంతకంటే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. ట్రంప్ భార్య మెలానియా ఏ వ్యాఖ్య చేయనప్పటికీ.. ఓటమిని అంగీకరించి హుందాగా వ్యవహరించాలని కోరుతున్నట్టు వ్యక్తిగత అభిప్రాయం వెల్లడించినట్టు సమాచారం. మరోవైపు.. ఇంకో కథనం హాట్ టాపిక్‌గా మారింది.

ట్రంప్‌కు మెలానియా విడాకులు ఇవ్వాలని భావిస్తున్నట్టు.. ప్రచారం జరుగుతోంది. ట్రంప్ వైట్ హౌస్‌ను విడిచిపెట్టిన వెంటనే మెలానియా కూడా ఆయనకు శాశ్వతంగా గుడ్‌బై చెప్తారని.. బ్రిటీష్ టాబ్లాయిడ్‌ డెయిలీ మెయిల్‌ ఒక కథనం ప్రచురించింది. 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ఎప్పుడెప్పుడు ముగింపు చెబుదామా అని మెలానియా నిమిషాలు లెక్కబెడుతున్నట్టుగా.. ట్రంప్ మాజీ రాజకీయ సలహయకురాలు ఒమరోసా న్యూమన్‌ చెప్పినట్టు డెయిలీ మెయిల్ పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story