ISRAEL: బందీల కాల్చివేత అవగాహన లేమే

ISRAEL: బందీల కాల్చివేత అవగాహన లేమే
నివేదిక బహిర్గతం చేసిన ఇజ్రాయెల్‌... విషాదాంత తప్పిదంగా అభివర్ణన...

హమాస్‌ మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లిన కొందరిని ఇజ్రాయెల్‌ సైన్యం పొరపాటున కాల్చేసిన ఘటనకు సంబంధించి తుది దర్యాప్తు వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఘటనపై ఇజ్రాయెల్ రక్షణ దళం జరిపిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూశాయి. బందీల కాల్చివేత ఘటనను ఇజ్రాయెల్‌ సైన్యం సమర్థించుకుంది. తమ బలగాలకు తగిన అవగాహన లేకపోవడమే... ఆ దారుణ ఘటనకు కారణమని తమ దర్యాప్తులో తేలినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. హమాస్‌ చెరలో ఉన్న బందీల కాల్చివేత ఘటనకు సంబంధించి ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన దర్యాప్తులో కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. ఈ దారుణ ఘటనను ఇజ్రాయెల్ సైన్యం సమర్థించుకుంది. ఆ ప్రాంతంలో బందీలు ఉన్నట్లు నిఘా సమాచారం ఉన్నప్పటికీ.. తమ బలగాలకు తగిన అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని.. తమ దర్యాప్తులో తేలినట్లు ఇజ్రాయెల్‌ రక్షణ దళం- IDF వెల్లడించింది.


డిసెంబర్‌ 15న గాజాలోని షిజాయా ప్రాంతంలో ముగ్గురు బందీలను శత్రువులుగా పొరబడి ఇజ్రా యెల్‌ సైన్యం కాల్చి చంపడంతో ఆ దేశంలో తీవ్ర నిరసనలు చెలరేగాయి. దీనిపై విచారణ జరిపిన ఐడీఎఫ్ దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. గాజాలో ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య భీకరదాడులు జరుగుతోన్న సమయంలో బిస్లమక్‌ బ్రిగేడ్‌ 17వ బెటాలియన్‌కు చెందిన ఓ సైనికుడు.. బందీలను హమాస్‌ సభ్యులుగా భ్రమించి కాల్పులు జరిపాడు. ఆ సైనికులు ముగ్గురు బందీలపై కాల్పులు జరపగా... అందులో ఇద్దరు మరణించగా మూడో వ్యక్తి సమీప భవనంలోకి పారిపోయాడని IDF వెల్లడించింది. వెంటనే కాల్పులు ఆపాలని అక్కడే ఉన్న తమ కమాండర్.... సైనికులను ఆదేశించాడని.అలాగే ఆ వ్యక్తి ఎవరనేది గుర్తించాలని చెప్పినట్లు నివేదికలో పేర్కొంది.

ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ భవనం నుంచి తనకు సహాయం చేయాలంటూహిబ్రూ భాషలో అరుపులు వినిపించాయని దాంతో కాల్పులు నిలిపేయాలని కమాండర్ మరోసారి ఆదేశాలు జారీ చేశాడని చెప్పింది. ఆ తర్వాత మూడో వ్యక్తి భవనం నుంచి బయటకు వచ్చి సైన్యం దిశగా వచ్చే ప్రయత్నం చేశాడని పేర్కొంది. ఆ సమయంలో పక్కన ట్యాంక్ నుంచి చప్పుడు వస్తుండటంతో కమాండర్ ఆదేశాలు సైనికులకు వినిపించలేదని వివరించింది. దాంతో అక్కడున్న ఇద్దరు సైనికులు సదరు మూడో బందీపై కాల్పులు జరిపినట్లు తుది దర్యాప్తులో వెల్లడైందని ఐడీఎఫ్‌ తెలిపింది. ఆ ముగ్గరు బందీల ఒంటిపై చొక్కాలు లేవని డ్రోన్‌ ఫుటేజ్‌ దర్యాప్తు ఆధారంగా గుర్తించినట్లు తెలిపింది.బలగాలకు దగ్గరగా వస్తున్నప్పుడు వారిలో.. ఒకరు తెల్ల జెండాను ఊపినా బలగాలకు వారు సరిగా కనిపించకపోవడమే కాల్పులకు దారితీసిందని తేలినట్లు చెప్పింది. తర్వాత ఆ ముగ్గురి మృతదేహాలను గుర్తింపు నిమిత్తం ఇజ్రాయెల్‌కు తరలించినట్లు వెల్లడించింది. బందీలను రక్షించే విషయంలో తమ సైన్యం విఫలమైందని ఐడీఎఫ్ విచారం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ ఘటనకు ముందు డిసెంబర్ 10న షిజాయా ప్రాంతంలో టన్నెల్‌ షాఫ్ట్ ముందు ఒక నోట్‌ను గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story