అంతర్జాతీయం

అర్ధరాత్రి 2 గంటల సమయం.. పాము బెడ్ పైకి ఎక్కి ఆమె నుదిటిపై..

పాములు ఇళ్లలోకి రావడం సర్వసాధారణమే కాని ఇలా బెడ్ ఎక్కి..

అర్ధరాత్రి 2 గంటల సమయం.. పాము బెడ్ పైకి ఎక్కి ఆమె నుదిటిపై..
X

తెల్లవారుజాము 2:00 గంటలు ఆమె నుదిటిపై ఏదో గుచ్చినట్లు అనిపించి లేచి చూసేసరికి.. పాము పాకుతూ బెడ్ మీద నుంచి విండోకి వున్న కర్టెన్ కి చుట్టుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఎమిలీ హిండ్స్ అనే మహిళ మంగళవారం రాత్రి ఓ పార్టీలో వైన్‌ తాగింది. మద్యం మత్తులో అలాగే నిద్రపోయింది. గాఢ నిద్రలో ఉండగా పాము కరిచింది.. కానీ ఆమె నిద్రలోనే ఆలోచించసాగింది. పిల్లలు తలపైన క్లిప్ ఎందుకు పెట్టారు అని.. కానీ నొప్పిగా అనిపించడంతో లేచి కూర్చుంది. అంతలో పాము తోక దిండు మీద కనిపించింది. దీంతో పాము కాటేసిందని అర్థమైంది.. అది బెడ్ మీద నుంచి విండో మీదుగా బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. పక్కనే ఉన్నఆమె భర్త జాసన్ ను లేపి పాము కాటేసిన విషయం చెప్పింది.

దాంతో పాము ఎక్కడుందో గుర్తించిన జాసన్ దాని తోకను పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే భార్య వద్దని వారించి తల భాగాన్ని పట్టుకోమంది. వెంటనే దాని తల భాగాన్ని పట్టుకుని పెరట్లోకి విసిరేశాడు. పాములు ఇళ్లలోకి రావడం సర్వసాధారణమే కాని ఇలా బెడ్ ఎక్కి మనిషిని కాటేయడం ఇదే మొదటి సారి అని చెబుతోంది ఎమిలీ. చూసి నేనేమీ కంగారు పడలేదు. ఆపై నేను అద్దంలో చూసుకుంటే రెండు గుర్తులు ఉన్నాయి కొద్దిగా బ్లడ్ కూడా ఉంది. పాము కాటు వల్ల నాకు తలనొప్పి వచ్చింది అంతకు మించి మరేమీ జరగలేదు.. వైద్యుడికి చూపించగా పాము విషపూరితమైంది కాదని నిర్ధారించారు. రెండు రోజుల తరువాత మళ్లీ ఆ పాము వారి పెరట్లో కనిపించింది. ఆ ఇంటితో ఆ మనుషులతో ఏదైనా అనుబంధం ఉందేమో.

Next Story

RELATED STORIES