Japan : జపాన్‌లో జనాభా తగ్గిపోతోంది..

Japan : జపాన్‌లో జనాభా తగ్గిపోతోంది..
రికార్డు స్థాయిలో 5.1 శాతం కనిష్ఠానికి పతనం

ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జపాన్‌లో జనాభా సంక్షోభం ముదురుతోంది. ఆ దేశంలోని మహిళల సగటు సంతానోత్పత్తి రేటు వరుసగా ఎనిమిదో ఏడాదీ క్షీణించి 2023లో రికార్డు స్థాయిలో 5.1 శాతం కనిష్ఠానికి పడిపోయింది. జపాన్‌ ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం గతేడాది ఆ దేశ జనాభా 8 లక్షల 31 వేలు తగ్గింది. మరోవైపు ఈ ఏడాది జపాన్ జనాభాలోని సగం మంది 50 అంతకంటే ఎక్కువ వయసు వారే ఉంటారని తెలుస్తోంది.

రెండు అణుబాంబులు పడి ఎంతో నష్టపోయినా..... 20వ శతాబ్దంలో తిరిగి పటిష్ఠంగా నిలబడిన ద్వీప దేశం జపాన్‌. అయితే కొన్నేళ్లుగా ఈ దేశాన్ని జనాభా సంక్షోభం పీడిస్తోంది. తాజాగా జపాన్ ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మహిళల సగటు సంతానోత్పత్తి రేటు వరుసగా ఎనిమిదో ఏడాదీ క్షీణించింది. 2023లో ఇది రికార్డు స్థాయిలో 5.1 శాతం కనిష్ఠానికి పడిపోయింది. జపాన్‌ ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం ఆ దేశంలో గతేడాది 8 లక్షల 31 వేల జనాభా తగ్గింది. 2023లో జపాన్‌లో 16 లక్షల మరణాలు, 7 లక్షల 58 వేల 631 జననాలు నమోదయ్యాయి.

జపాన్ ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం ఈ ఏడాది జపాన్ జనాభాలోని సగం మంది ప్రజలు 50 లేదా అంతకంటే ఎక్కువ వయసు దాటుతారని తెలుస్తోంది. జపాన్‌లో వివాహాలు చేసుకుంటున్న వారి సంఖ్య కూడా భారీగా తగ్గుతోంది. 2022తో పోల్చితే 5.9 శాతం మేర తగ్గి 4 లక్షల 89 వేల 281 కి ఆ సంఖ్య పడిపోయింది. గత 90 ఏళ్లలో 5 లక్షల కంటే తక్కువగా వివాహాలు అక్కడ నమోదు కావడం ఇదే తొలిసారి. నవజాత శిశువుల సంఖ్య వేగంగా తగ్గిపోవడానికి జపాన్ యువత ఆలస్యంగా వివాహాలు చేసుకోవడమే కారణమని తెలుస్తోంది. మరికొందరు అవివాహితులుగా ఉండటం కూడా మరో కారణమని సమాచారం. 2021లో తమ దేశ జనాభా 12.57 కోట్లు అని జపాన్ ప్రకటించింది.....VIS

జనాభా సంక్షోభంపై జపాన్ ప్రధాని పుమియో కిషిదా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాను తిరిగి పెంచాలంటే 2030 వరకు తమ మద్ద ఉన్న సమయమే....చివరి అవకాశంగా భావించాలని పేర్కొన్నారు. ఇప్పటికే చైల్డ్ కేర్ అలవెన్స్‌లు ప్రకటిస్తూ జనాభా పెంపునకు యత్నిస్తున్నారు. మరిన్ని ప్రోత్సాహకాలు ఇచ్చి జనాభా సంక్షోభం నుంచి బయటపడాలని ప్రణాళికలు రచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story