Japan : జోకర్ గా నటించి రియల్ గా చంపాడు

Japan : జోకర్ గా నటించి రియల్ గా చంపాడు
ప్రేయసిపై కోపంతో రైలుకి నిప్పు.. 23 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

డీసీ కామిక్స్‌లోని ‘జోకర్’ లా రెడీ అయిన ఒక వ్యక్తి ట్రెయిన్‌లో మారణకాండ సృష్టించాడు. ఒక వ్యక్తిని చంపటంతో పాటు ట్రైన్ బోగీకి నిప్పు పెట్టి మరో 12 మంది గాయాల పాలవ్వడానికి కారణమయ్యాడు. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయస్థానం నిందితుడికి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

వివరాల్లోకి వెళ్తే..

అది 2021 సంవత్సరం. హాలోవీన్ రోజులు కావడంతో చాలామంది వింత వింత కాస్ట్యూమ్స్ వేసుకుని హడావిడిగా తిరుగుతున్నారు. ఒక వ్యక్తి జోకర్ వేషం ధరించి ట్రెయిన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. డీసీ క్యారెక్టర్ జోకర్ తరహాలో పిచ్చి గంతులు వేస్తూ సడన్గా ఒక 70 ఏళ్ల వృద్ధుడిపై కత్తితో దాడి చేశాడు. అతను తేరుకొనేలోపే మరికొంతమంది పై దాడి చేసాడు. అంతేకాదు ఒక్కసారిగా తన జేబులోనుంచి లెటర్ తీసి ట్రైన్ కు నిప్పు పెట్టాడు. ఈ దాడిలో 12 మంది గాయపడ్డారు.


విచారణ సందర్భంగా, హట్టోరి తన మాజీ ప్రియురాలు తనతో విడిపోయిన ఆరు నెలలకే వేరొకరిని వివాహం చేసుకుందని, అది విని మనస్థాపన చెందిన తరువాతే తాను ఈ నేరాలకు పాల్పడ్డానని కోర్టుకు తెలిపాడు.

అక్కడి లోకల్ మీడియా కూడా అతను కావాలనే మరణశిక్షను పొంది జీవితాన్ని ముగించడానికే ఈ నేరాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నట్లు తమ నివేదికలో తెలిపింది . కేసుని విచారించిన టోక్యో డిస్ట్రిక్ట్ కోర్టు.. నిందితుడికి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నిజానికి జపాన్ లో క్రైమ్ రేటు చాలా తక్కువ. అలాగే ఇక్కడ ఒక వస్తువు పోయినా దొరకడం కూడా చాలా సుళువు. దానికి కారణం జపాన్ ప్రజలలో ఉండే నైతికత. పోలీసులు పక్కన లేనప్పుడు కూడా తప్పు చేయకూడదని జపాన్ సంస్కృతి బోధిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story