Japan-China: న్యూక్లియర్ వాటర్ చిచ్చు

Japan-China: న్యూక్లియర్ వాటర్ చిచ్చు
వార్నింగ్ ఇచ్చుకుంటున్న ఇరుదేశాలు

చైనా, జపాన్ దేశాల మధ్య న్యూక్లియర్ వాటర్ చిచ్చు పెట్టింది. ఈ రెండు దేశాల మధ్య వివాదం పుకుషిమా అణు కర్మాగారం నుంచి సముద్రంలోకి జపాన్ విడుదల చేయడంతో వివాదం మొదలైంది. ఫుకుషియా అణుకేంద్రం నుంచి వచ్చే వ్యర్థ జలాలను జపాన్ పసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేస్తోంది. దీనికి ఐక్యరాజ్యసమితి కూడా ఆమోదం తెలిపింది. అయితే ఆ వ్యర్థ జలాల్లో రేడియో ధార్మికత ఉండొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా చైనాలోని జపాన్ రాయబార కార్యాలయంపై రాళ్లదాడి జరిగింది. దీంతో జపాన్, చైనాను తీవ్రంగా హెచ్చరించింది. దౌత్యకార్యాలయాలపై రాళ్లదాడిపై జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా చైనాపై మండిపడ్డారు. పుకుషిమా అణు కర్మాగారం నుంచి శుద్ధి చేసిన అణు జలాలను జపాన్ పసిఫిక్ సముద్రంలోకి విడుదల చేసింది. జపాన్, యూఎన్ న్యూక్లియర్ వాచ్ డాగా ఈ జలాలు సురక్షితమని చెప్పినప్పటికీ చైనా మాత్రం తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూనే ఉంది. జపాన్ చర్య తర్వాత చైనా ఆ దేశం నుంచి సముద్ర దిగుమతులపై నిషేధం విధించింది.


మరోవైపు చైనాలో ఉండే తమ పౌరులకు జపాన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో జపనీస్ మాట్లాడవద్దని సూచించింది. జపాన్ రాయబార కార్యాలయం, జపనీస్ స్కూళ్లపై రాళ్ల దాడిపై కిషిడా తీవ్రంగా స్పందించారు, చైనా రాయబారిని పిలిచి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

2011 మార్చి 11న సంభవించిన భారీ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 9.0 మాగ్నిట్యూడ్‌తో వచ్చి భూమి తన అక్షం నుంచి పక్కకు కూడా జరిగింది. అది భారీ సునామీకి కూడా కారణమైంది. ఫుకుషిమా డాయిచి అణువిద్యుత్ కేంద్రం ఫుకుషిమా ప్రాంతంలోని ఒకుమాలో ఉంది. అణువిద్యుత్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలు భూకంపం రాబోతున్నట్లు ముందుగానే గుర్తించాయి. వెంటనే ఆటోమేటిక్‌గా రియాక్టర్లను షట్‌డౌన్‌ చేశాయి. అక్కడి కోర్ పరికరాల చుట్టూ చల్లబరిచే ద్రావణాలను చల్లేందుకు డీజిల్ జనరేటర్లు కూడా స్టార్ట్ అయ్యాయి.

అయితే, సుమారు 14 మీటర్ల ఎత్తున వచ్చిన అలలు అణువిద్యుత్ కేంద్రానికి రక్షణగా నిర్మించిన గోడను దాటి మరీ కేంద్రంలోకి భారీగా నీళ్లు చేరాయి. భారీగా వచ్చిన నీటితో ఎమర్జెన్సీ జనరేటర్లు కూడా పాడైపోయాయి. అణు ఇంధనాన్ని భద్రపరిచిన కొన్ని కోర్ పరికరాలు అధిక ఉష్ణోగ్రతల కారణంగా మెల్ట్ అయిపోయాయి. భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. రేడియో ధార్మిక పదార్థాలు వాతావరణంలోకి, పసిఫిక్ సముద్రంలోకి లీక్ కావడం ప్రారంభించడంతో లక్షా యాభై వేల మంది స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు.

అది జరిగి ఇప్పటికి దశాబ్దం గడచింది. పరిస్థితులను చక్కదిద్దేందుకు ట్రిలియన్ల యెన్‌లు(జపాన్ కరెన్సీ) ఖర్చు చేస్తున్నా, అవి పూర్తయ్యేందుకు సుమారు 40 ఏళ్లు పట్టొచ్చని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story