నత్తి అని వెక్కిరించిన ఫ్రెండ్సే..గొప్పగా చెప్పుకునే స్థాయికి ఎదిగిన బైడెన్

నత్తి అని వెక్కిరించిన ఫ్రెండ్సే..గొప్పగా చెప్పుకునే స్థాయికి ఎదిగిన బైడెన్
అమెరికా చరిత్రలోనే అత్యధిక కాలంపాటు ఉపాధ్యక్ష పదవిలో కొనసాగిన వ్యక్తిగా జో బైడెన్ రికార్డు సాధించారు.

బైడెన్ జీవితమేమీ పూలపాన్పు కాదు. పోరాడితేనే కదా రాటుదేలేది. అది బైడెన్ జీవితంలో నిజమైంది. లేకపోతే.. చిన్నప్పుడు నత్తినత్తిగా మాట్లాడుతున్నావంటూ వెక్కిరించిన ఫ్రెండ్సే.. ఇప్పుడు మా అమెరికా అధ్యక్షుడు అంటూ గొప్పగా చెప్పుకునే స్థాయికి ఎదిగారు బైడెన్.

1987లో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి పోటీలో తొలిసారిగా అడుగు పెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటి బ్రిటిష్ లేబర్ పార్టీ లీడర్ నీల్ కినోక్ ఉపన్యాసాన్ని బైడెన్అ నుకరించారంటూ ఆరోపణలు రావడంతో ఆయన ప్రయత్నాలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. 2008లో మళ్లీ బైడెన్ అధ్యక్ష పోటీలో అడుగు పెట్టడానికి ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నం కూడా విజయవంతం కాలేదు.

అయితే.. అప్పుడు డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న బరాక్ ఒబామా, తనకు తోడుగా ఉపాధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి జో బైడెన్‌ను ఎంచుకున్నారు. ఆ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ గెలిచింది. ఒబామా-బైడెన్ జంట ఆ తర్వాత 2012 అధ్యక్ష ఎన్నికల్లోనూ గెలిచింది.

బైడెన్ అనేకమార్లు ఒబామాను తన సోదరునిగా అభివర్ణించారు. ఒబామా, తన అధ్యక్ష పదవి ఆఖరు రోజుల్లో బైడెన్‌కు అమెరికా దేశ అత్యున్నత పురస్కారమైన 'ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం' పురస్కారం ఇచ్చి సత్కరించారు. 2009-2019 వరకు అమెరికా 47వ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు బైడెన్. అమెరికా చరిత్రలోనే అత్యధిక కాలంపాటు ఉపాధ్యక్ష పదవిలో కొనసాగిన వ్యక్తిగా జో బైడెన్ రికార్డు సాధించారు.

29 ఏళ్లకే సెనేటర్ పదవికి ఎన్నికైనప్పటి నుంచి ఉపాధ్యక్ష పదవికి ఎన్నికయ్యే వరకు తన సుదీర్ఘ రాజకీయం జీవితాన్ని తెలిపేలా 'ప్రామిసెస్ టు కీప్' అనే పేరుతో ఓ పుస్తకం రాశారు బైడెన్. అది చదివితే అర్థమవుతుంది బైడెన్ అంటే ఏమిటో. దానికి ముందు, ఆ తరువాత కూడా బైడెన్ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇదొక్కటే కాదు.. తన కొడుకు బ్యూ.. క్యాన్సర్ మహమ్మారితో చేసిన పోరాటాన్ని.. దానిని చూసి తన కుటుంబ సభ్యులు పడ్డ బాధను కళ్లకు కట్టేలా 'ప్రామిస్ మి డాడ్' పుస్తకంలో ఆవేదనాక్షరాలతో రాసుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story