జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌.. అమెరికా బ్యాన్

జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌.. అమెరికా బ్యాన్
జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ వాడకాన్ని అమెరికా ప్రభుత్వం నిలిపివేసింది.

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ వాడకాన్ని అమెరికా ప్రభుత్వం నిలిపివేసింది. ఈ వ్యాక్సిన్ వేయించుకున్న ఆరుగురిలో రక్తం గడ్డకట్టుకుపోయింది. దీంతో వెంటనే జే అండ్ జే వ్యాక్సిన్‌ వినియోగాన్ని నిలిపివేస్తూ USFDA ఆదేశాలు జారీ చేసింది.

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ తయారుచేసింది. రెండు రోజుల క్రితం వరకు దాదాపు 68 లక్షల డోసుల వ్యాక్సిన్లు ఇచ్చారు. అయితే, కొందరికి మాత్రం చాలా తీవ్రంగా రక్తం గడ్డ కట్టే సమస్య ఎదురైనట్టు గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా జాన్సన్ అండ్ జాన్సన్ టీకాను నిలిపివేయాలని సిఫార్సు చేశారు.

ప్రస్తుతానికైతే రక్తం గడ్డ కట్టే సమస్య చాలా అరుదుగా కనిపించినట్టు తేల్చారు. ఆరుగురిలో ఈ సమస్య కనిపించడంతో.. ఆ డేటాను సమీక్షిస్తున్నట్లు FDA తెలిపింది. అమెరికాతోపాటు, సౌతాఫ్రికా, యూరోపియన్ యూనియన్ కూడా జాన్సన్ వ్యాక్సిన్ వినియోగాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి.

యురోపియన్ దేశాల్లోనూ జే అండ్ జే వ్యాక్సిన్ వల్ల ఎదురైన దుష్ప్రభావాలపై అమెరికాకు చెందిన CDC, FDA సంస్థలు పరీక్షలు చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story