అమెరికా ఉపాధ్యక్షురాలి మెడలో ముత్యాల హారం వెనుక సీక్రెట్

అమెరికా ఉపాధ్యక్షురాలి మెడలో ముత్యాల హారం వెనుక సీక్రెట్
కమల డ్రెస్సింగ్‌లో ఆకట్టుకునే అంశం ఆమె మెడలో ధరించిన ముత్యాల హారం.. ఫ్యాషన్ ప్రియులతో పాటు అందరి దృష్టి ఆమె ధరిస్తున్న

యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన మొదటి దక్షిణాసియా మహిళగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు. ఆమె ఇప్పటికే శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా న్యాయవాది, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ మరియు కాలిఫోర్నియా సెనేటర్‌గా పనిచేసినప్పటికీ, వైట్ హౌస్‌ రాజకీయాల్లో భాగమవడం తన 30 సంవత్సరాల కెరీర్‌లో ముఖ్యమైంది.

కమల డ్రెస్సింగ్‌లో ఆకట్టుకునే అంశం ఆమె మెడలో ధరించిన ముత్యాల హారం.. ఫ్యాషన్ ప్రియులతో పాటు అందరి దృష్టి ఆమె ధరిస్తున్న ముత్యాల హారంపై మళ్లుతోంది. ముఖ్యమైన సమావేశాలకు హాజరైన ప్రతిసారి ఆమె ముత్యాలు ధరిస్తారు. ఆఖరికి మొన్న ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా హారిస్ హారం ధరించారు.

1986లో హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకునే రోజుల్లో 'అల్ఫా కప్పా అల్ఫా' (ఏకేఏ) సొసైటీ అధ్యక్షురాలిగే ఉండే వారట. ఈ సొసైటీ కళశాలల్లో విద్యార్థినుల మధ్య స్నేహ భావం పెంచడం, సమాజంలో యువతులను ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేస్తుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ సొసైటీ పని చేస్తుంది. దీనిని 1908లో తొమ్మిది మంది విద్యార్థినులు కలిసి స్థాపించారు.

ఇరవైమంది భాగస్వాములతో ఈ సొసైటీ నడుస్తోంది. అందుకే ఏకేఏ వ్యవస్థాపకులను ట్వంటీ పెరల్స్‌గా పిలుచుకుంటారు. ఇక ఈ సొసైటీలో చేరిన ప్రతి సభ్యురాలికి ముత్యాలతో కూడిన బ్యాడ్జి ఇస్తారట. అలా సొసైటీలో సభ్యురాలైన కమల కూడా 'ఏకేఏ' గౌరవార్థం ప్రతి ముఖ్యమైన సందర్భంలో ముత్యాల హారం ధరిస్తారు.

అలా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా కమల ఒక్క వరుస ముత్యాల హారం ధరించారు. ప్రస్తుత ఏకేఏ అధ్యక్షురాలు గ్లెండా గ్లోవర్ మాట్లాడుతూ.. ముత్యాల స్వచ్ఛతకు, జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తాయని తెలిపారు. తమ సంస్థ ద్వారా యువతులను భవిష్యత్ తరాల నేతలుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story