ఎన్నికల వేళ వ్యాక్సిన్ గోల.. ట్రంప్ ని నమ్మలేం: హారిస్

ఎన్నికల వేళ వ్యాక్సిన్ గోల.. ట్రంప్ ని నమ్మలేం: హారిస్
మరోసారి అధ్యక్షపీఠాన్ని అలంకరించడానికే అన్న విషయం స్పష్టమవుతోందని ఉపాధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిస్ వ్యాఖ్యానించారు.

అగ్రరాజ్యం అమెరికా కరోనాని కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమైందని విమర్శలను ఎదుర్కొంటున్న అధ్యక్షుడు ట్రంప్.. వ్యాక్సిన్ తో ఆ విమర్శలకు చెక్ పెట్టాలనుకున్నారు.. పరిశోధనా సంస్థలపై ఒత్తిడి పెంచి మరీ నవంబర్ 1 నాటికి వ్యాక్సిన్ వచ్చేస్తుందని ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెబుతున్నారు. ఈ హడావిడి అంతా చూస్తుంటే మరోసారి అధ్యక్షపీఠాన్ని అలంకరించడానికే అన్న విషయం స్పష్టమవుతోందని డెమోక్రాటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిస్ వ్యాఖ్యానించారు. ఒకవేళ అధ్యక్ష ఎన్నికల నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. దాని సామర్థ్యం, భద్రతపై తనకు ఏమాత్రం నమ్మకం లేదని ఆమె అన్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసమే వ్యాక్సిన్ తయారీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story