మైక్‌ పెన్స్‌పై ఆధిపత్యం కనబరిచిన కమలా హ్యారీస్‌

మైక్‌ పెన్స్‌పై ఆధిపత్యం కనబరిచిన కమలా హ్యారీస్‌
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా మరో డిబేట్ వాడివేడిగా సాగింది. ఉపాధ్యక్ష పదవి బరిలో ఉన్న ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, భారత సంతతికి చెందిన కమలా..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా మరో డిబేట్ వాడివేడిగా సాగింది. ఉపాధ్యక్ష పదవి బరిలో ఉన్న ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ మధ్య ....సాల్ట్ లేక్ సిటీలో డిబేట్‌ జరిగింది. ఈ చర్చలో.... మైక్ పెన్స్‌పై కమలా హ్యారీస్‌ ఆధిపత్యం కనబరిచారు. ప్రధానంగా చైనాతో ట్రేడ్ వార్, కరోనా వైరస్ నియంత్రణ, అమెరికా ఆర్థిక పరిస్థితులు.. ఈ డిబేట్‌లో ప్రస్తావనకు వచ్చాయి. చైనా అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు కమలా హ్యారీస్‌ చెలరేగిపోయారు. అధ్యక్షుడు ట్రంప్ అనాలోచిత నిర్ణయాలతో లక్షలమంది అమెరికన్లు ఉపాధిని కోల్పోయారన్నారు. చైనాతో ట్రేడ్‌వార్‌తో ట్రంప్‌ సాధించిందేంటని నిలదీశారు. అమెరికాకు మిత్రులు లేకుండా చేశారని మండిపడ్డారు.

అటు కమలాహ్యారీస్‌కు ధీటుగా సమాధానం ఇచ్చారు మైక్ పెన్స్. అమెరికాను అగ్రరాజ్యంగా కొనసాగించాలన్న లక్ష్యంతోనే తాము పనిచేస్తున్నామన్నారు. ఆ విధానంతో ఎన్నికల ప్రణాళిక రూపొందించుకున్నామన్నారు. అమెరికాలో అమెరికన్లే అనే నినాదంతో పని చేస్తున్నామన్నారు. యువతకు ఉపాధిని కల్పించడానికి, ఆర్థిక స్థితిగతులను మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నిస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story