Kenya: రుతుక్రమంపై రగడ... రక్తపు చారికలతో పార్లిమెంట్ లోకి....

Kenya: రుతుక్రమంపై రగడ... రక్తపు చారికలతో పార్లిమెంట్ లోకి....
కెన్యా పార్లిమెంట్ లో రుత్రుక్రమంపై రగడ; తెల్లని సూట్ పై నెత్తుటి మరకలతో....

కెన్యా పార్లిమెంట్ సమావేశాల్లో రుతుక్రమంపై తలెత్తిన చర్చ అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదమవుతోంది. పార్లమెంట్ సమావేశాలకు సెనేటర్ గ్లోరియా ఓరోబ్వా రక్తపు చారికలతో కూడిన తెల్లటి దుస్తులు ధరించి హాజరవ్వడం తాజా చర్చకు దారితీసింది. అయితే ఆమె సహ సెనేటర్లు ఆమె చర్యను తీవ్రంగా వ్యతిరేకించడం, ఆమెను సమావేశ మందిరాన్ని విడిచి వెళ్లాల్సిందిగా అదేశించడంతో వివాదం రాజుకుంది. ఇక ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన గ్లోరియా పార్లమెంట్ లోకి వెళ్లక ముందే తన దుస్తులపై మరకలు అవ్వడం గమనించానని తెలిపింది. అయితే రుతుక్రమం, దాని పర్యావసానాలపై తానే స్వయంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున అలాగే సమావేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది. రక్తపుమరకలతో సమావేశాలకు హాజరైతే అందరూ తనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారని తన వద్ద పనిచేసే ఉద్యోగులు ముందే హెచ్చరించారని తెలిపింది. మరోవైపు గ్లోరియా చర్యపై ఇతర పార్లిమెంట్ సభ్యులు మండిపడుతున్నారు. ఆమె నిజంగానే రుత్రక్రమంలో ఉందా లేక నటిస్తుందో కూడా అర్ధం కావడంలేదని స్పీకర్ కు ఓ సెనేటర్ ఫిర్యాదు కూడా చేశారట. ఆమె ఈ పార్లమెంట్ కు మాయని మచ్చ తీసుకువచ్చారని మరొకరు స్పందించారు. ఇక గ్లోరియా మాత్రం తన చర్యకు కట్టుబడి ఉన్నట్లు వ్యాఖ్యానించారు. తన దుస్తులపై మరకలు చూడగానే, తనకు ఏమైనా సహాయం కావాలా అని ఎవరూ అడగలేదని, కానీ, తనకు రస్తస్రామవుతున్నందుకు సిగ్గు పడుతున్నారని స్పష్టం చేశారు.



Tags

Read MoreRead Less
Next Story