Alexei Navalny: పుతిన్‌ విమర్శకుడికి 19 ఏళ్ల జైలు

Alexei Navalny: పుతిన్‌ విమర్శకుడికి 19 ఏళ్ల జైలు
సాక్ష్యాలు లేకుండా.. నిమిషాల్లో తీర్పు

రష్యాకు చెందిన ప్రముఖ ప్రతిపక్ష నేత, పుతిన్‌ విమర్శకుడు, అవినీతి వ్యతిరేక ప్రచారకర్త అయిన అలెక్సీ నవాల్నీకి 19 ఏళ్ల జైలు శిక్ష పడింది. వివిధ ఆరోపణలపై నవాల్నీ ఇప్పటికే 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు అతనిపై ఉన్న ఉగ్రవాద ఆరోపణలపై సరైన ఆధారాలు లేకుండానే నవాల్నీని రష్యా కోర్టు దోషిగా తేల్చింది. నవాల్నీని క్లోజ్డ్‌ డోర్‌ పద్ధతిలో కోర్టు విచారించారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో రోజుల తరబడి విచారణ జరుపుతారు. అయితే నవాల్నీని కేవలం 10 నిమిషాల్లో దోషిగా న్యాయమూర్తి తేల్చి శిక్ష విధించారు. తీర్పుపై నవాల్నీ అప్పీలుకు వెళతారని ఆయన సన్నిహితులు తెలిపారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బద్ధ శత్రువుగా పిలుచుకునే అలెక్సి నవాల్నీని తీవ్రవాదంతో సహా అనేక నేరాలపై పదకొండున్నర సంవత్సరాల జైలు శిక్షలో భాగంగా జనవరి 2021 నుండి శిక్షను అనుభవిస్తున్నారు. ఇప్పుడు అతనిపై మరిన్ని అభియోగాలను మోపి అతడి జైలుశిక్షను మరింత పొడిగించాయి.

ఇంతకీ ప్రాసిక్యూటర్లు అలెక్సి నవాల్నీపై మోపిన అదనపు కేసులు. తీవ్రవాద సంస్థ ఏర్పాటు, నాజీ మద్దతుదారులకు పునరావాసం, తీవ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా రెండు బహిరంగ సభలు, ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా నవాల్నీ అవినీతి నిరోధక నిధి పేరిట మరో సంస్థను స్థాపించడం, మైనర్లను ఉగ్రవాదం వైపు నడిపించడం వంటివి. తీవ్రవాదానికి ఆర్ధికంగా ఊతమిచ్చేందుకు నిధులు సేకరించడం వంటి అభియోగాలను మోపారు.

అయితే ఈ కేసుల విషయమై నవాల్నీ స్పందిస్తూ ప్రజా జీవితానికి తనని దూరంగా ఉంచాలన్న కారణంతోనే కొత్త కొత్త కేసులు మోపి మరో 20 ఏళ్ళ పాటు జైల్లోనే మగ్గిపోయేలా చేయాలని క్రెమ్లిన్ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి అన్నారు. తనను తీవ్రవాదిగా చిత్రీకరించి మొత్తంగా 35 ఏళ్ల జైలు శిక్ష విధించాలన్నదే రష్యా అధ్యక్షుడి లక్ష్యం అన్నారు. ఇతర రాజకీయ ఖైదీలలాగే తనను కూడా జీవితాంతం జైలులో ఉంచేస్తారని విషయం తన ఎప్పుడో తెలుసుకున్నానన్నారు.

జైల్లో ఉన్నా సరే తనAlexei Navalny: అనుచరుల సాయంతో సోషల్ మీడియా ద్వారా ఎప్పటికపుడు యాక్టివ్ గా ఉంటారు నవాల్నీ. కొత్త అభియోగాల విషయంలో క్రెమ్లిన్ పన్నుతున్న కుట్రను కూడా ఆయన తన సోషల్ మీడియాలో విడుదల చేశారు.

Tags

Read MoreRead Less
Next Story