కొడుకు ఆనందం కోసం నాన్న నడిచే గోడగా మారి.. వీడియో వైరల్

కొడుకు ఆనందం కోసం నాన్న నడిచే గోడగా మారి.. వీడియో వైరల్
బయట ఎన్ని ఆటలు ఆడినా నాన్న ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే.. వాళ్లతో ఆడుకోవాలని కోరుకుంటారు..

బయట ఎన్ని ఆటలు ఆడినా నాన్న ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే.. వాళ్లతో ఆడుకోవాలని కోరుకుంటారు.. నాన్న అలసి పోయి వచ్చాడేమో అని ఆలోచించలేని పసి హృదయం వారిది.. పిల్లల హృదయంలో తండ్రులు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటారు. 'బ్యూటెంగెబెడెన్' అనే డచ్ ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇది ఒక ఆరోగ్యకరమైన వీడియో. ఇందులో ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి భుజానికి తగిలించి ఉన్న నెట్‌లో బంతిని వేయడం కనిపిస్తుంది. ఈ వీడియోకి "బాల్ ఈజ్ లైఫ్" అని క్యాప్షన్ రాసి ఉంది.

బాలుడు లాస్ ఏంజిల్స్ లేకర్స్ జెర్సీ నంబర్ 23 ధరించి ఉన్నాడు. తండ్రి భుజంపై బాస్కెట్‌బాల్ నెట్‌ ఉంచుకుని ముందు నడుస్తున్నాడు. వెనుక అతడి కొడుకు నెట్ లో బాల్ వేస్తుంటే.. దాన్ని పట్టుకున్న తండ్రి దాన్ని మళ్లీ కొడుక్కి అందిస్తున్నాడు. కొడుకు ఈ చిన్ని ఆనందాన్ని ఇచ్చిన తండ్రి ఆలోచన అద్భుతం అని ఈ వీడియోని చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. బాలుడు స్కోర్ చేయడానికి ఈ విధానం ఖచ్చితంగా సరిపోతుంది అని అంటున్నారు.

చేతిలో ఒక చిన్న బంతిని పట్టుకొని, బాలుడు తన తండ్రి వెనుక నడుస్తూ బాస్కెట్ లో వేయడం, దాన్ని తండ్రి సరిగ్గా పట్టుకోవడం చూడముచ్చటగా ఉందని అంటున్నారు. కొడుకు ఓ మంచి క్రీడాకారుడిగా ఎదగడానికి తండ్రి తోడ్పాటు ఎంత అవసరమో ఈ వీడియో చక్కగా వివరిస్తోంది. పిల్లల సంతోషం కోసం ప్రతిదీ అందించడానికి తండ్రి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. తమ బిడ్డల ఎదుగుదలలో తండ్రి ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఈ వీడియో ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ వీడియోకు 202 రీట్వీట్లు, 1100 లైకులతో పాటు 4,73,300 మంది వీక్షించారు.

Tags

Read MoreRead Less
Next Story