బంగారు తల్లి.. బయటపడింది.. మృత్యువును జయించింది

బంగారు తల్లి.. బయటపడింది.. మృత్యువును జయించింది
భూకంపం చిన్నారిని మృత్యుఒడికి చేర్చాలనుకుంది.. మళ్లీ ఎందుకో అంతలోనే ఆగిపోయింది..

భూమాత భద్రంగా నాలుగు రోజులు చిన్నారిని తనలోనే దాచుకుంది. అమ్మ లేదు తనని ఒడిలోకి చేర్చుకునేందుకు.. అయినా అమ్మా అని పిలుస్తూనే ఉంది. ఆ పిలుపులు సహాయక బృందాల చెవిలో పడ్డాయి.. శిధిలాల మధ్య చిక్కుకున్న చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.. పాప ప్రాణాలతో బయటపడడం చూసి దేవుడు గొప్పవాడు (గాడ్ ఈజ్ గ్రేట్) అంటూ గట్టిగా కేకలు వేశారు స్థానికులు. టర్కీలోని ఇజ్మీర్‌లో భూకంపం ధాటికి ఆకాశహార్మ్యాలు నేలకూలాయి.

భూకంపం ధాటికి నేలమట్టమైన భవన శిథిలాల మధ్య ఇరుక్కుని 91 గంటల తర్వాత సురక్షితంగా బయటపడిన ఆ మృత్యుంజయరాలి పేరు ఐదా గెజ్లిన్. ప్రమాదంలో తల్లి మరణించింది.. భవనం కూలిన సమయంలో తండ్రి, సోదరుడు ఇంట్లో లేరు. దాంతో వాళ్లు సురక్షితంగా ఉన్నారు. కానీ చిన్నారి తండ్రి భార్యా, బిడ్డల కోసం నాలుగు రోజులుగా వెతుకుతున్నాడు.. పాప ప్రాణాలతో ఉందని తెలిసి ఊపిరి పీల్చుకున్నాడు.. భార్యని పోగొట్టుకున్నందుకు దుఖిస్తున్నాడు. మంగళవారం పాపను వెలికి తీసిన సహాయక బృంద సభ్యుడొకరు మీడియాతో తన ఉద్వేగాన్ని పంచుకున్నారు. మమ్మల్ని చూడగానే పాప చేయి ఊపింది.




నాలుగు రోజులు ఆహారం, నీళ్లు లేకపోయినా అప్పుడే నిద్ర లేచినట్టుగా ఉన్న పాప ముఖం చూసి ఆశ్చర్యపోయారు సహాయక బృంద సభ్యులు.. వెంటనే పాపను శిధిలాల క్రింద నుంచి తొలగించి ఆస్పత్రికి తరలించారు. మార్గ మధ్యంలో చిన్నారి అమ్మ గురించి అడిగింది. ఇంకా మీట్ బాల్స్, యోగర్ట్ డ్రింక్ కావాలని అడిగిందని అక్కడి మీడియా సంస్థ వెల్లడించింది. కాగా భూకంప తీవ్రతకు ఇప్పటివరకు 107 మంది మరణించినట్లు వార్తా సంస్థల సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story