ప్రాణాలు తీస్తున్న ఆన్‌లైన్‌ గేమ్స్

ప్రాణాలు తీస్తున్న ఆన్‌లైన్‌ గేమ్స్
ఆడియన్స్ నుంచి ఎక్కువ గిఫ్ట్స్ సంపాదించాలని గేమ్‌లో పోటీపడ్డారు. ఓడిన వ్యక్తి క్రేజీ శిక్షను అనుభవించాలని నిబంధన విధించుకున్నారు.ఈ గేమ్‌లో ఓడిన జూవా ముందు లైవ్‌లో ఏడుబాటిళ్ల చైనా ఓడ్కాను పెట్టాడు గెలిచిన వ్యక్తి గేమ్‌లో ఓడినందుకు ఆ రోజురాత్రి లైవ్‍లోనే ఏడుబాటిళ్ల బైజు ను తాగాడు జువా.

ఆన్‌లైన్‌ గేమ్‌ ప్రాణాలు తీస్తున్నాయి.సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకోవడానికి యువత పోటీపడుతుంటారు. రకరకాల వీడియోలతో ఫాలోవర్స్‌ను అట్రాక్ట్ చేస్తుంటారు.స్టంట్స్‌ చేస్తూ కొన్నిసార్లు ప్రాణాలమీదికి తెచ్చుకుంటారు.ఇలాంటి ఘటనే చైనాలో జరిగింది. లైవ్‌ స్ట్రీమింగ్‍లో పోటీపడి అతిగా మద్యం తాగి ప్రాణాలను కోల్పోయాడో వ్యక్తి.

చైనా షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌ డౌయిన్‍లో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ గేమ్స్ అర్ధరాత్రి ఒంటిగంటకు మొదలై మధ్యాహ్నం ఒంటి గంట వరకు నడుస్తాయి. ఇద్దరు కంటెండర్లు పీకే అనే పేరుతో ఓ క్రేజీ గేమ్ ఆడారు. ఆడియన్స్ నుంచి ఎక్కువ గిఫ్ట్స్ సంపాదించాలని గేమ్‌లో పోటీపడ్డారు. ఓడిన వ్యక్తి క్రేజీ శిక్షను అనుభవించాలని నిబంధన విధించుకున్నారు.ఈ గేమ్‌లో ఓడిన జూవా ముందు లైవ్‌లో ఏడుబాటిళ్ల చైనా ఓడ్కాను పెట్టాడు గెలిచిన వ్యక్తి గేమ్‌లో ఓడినందుకు ఆ రోజురాత్రి లైవ్‍లోనే ఏడుబాటిళ్ల బైజు ను తాగాడు జువా.

అయితే మద్యం మత్తులోనే అస్వస్థతకు గురైన జువా..నిద్రలోనే ప్రాణాలు విడిచాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బైజు ఓడ్కాలో 30 నుంచి 60 శాతం ఆల్కహాల్ ఉంటుందని. ఒక బాటిల్ పూర్తిగా తాగితేనే ప్రాణాలకు ప్రమాదం అని వైద్యులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story