Luxury Flat Rs 420 Crore :పెంట్ హౌస్‌కి రూ.420 కోట్లా.. సారు సంపాదన శానా ఉన్నట్టుంది..

Luxury Flat Rs 420 Crore :పెంట్ హౌస్‌కి రూ.420 కోట్లా.. సారు సంపాదన శానా ఉన్నట్టుంది..

Luxury Flat Rs. 420 Crore

Luxury Flat Rs 420 Crore :100 గజాల స్థలంలో ఓ చిన్న ఇల్లు కట్టుకుందామంటే తాతలు గుర్తొస్తుంటారు దిగువ మధ్యతరగతి వాసికి.. బడా బాబులు మాత్రం తమ హోదాని చాటి చెప్పుకోవడానికి ఖరీదైన వస్తువులను కొని ముచ్చట తీర్చుకుంటారు.

Luxury Flat Rs. 420 Crore : 100 గజాల స్థలంలో ఓ చిన్న ఇల్లు కట్టుకుందామంటే తాతలు గుర్తొస్తుంటారు దిగువ మధ్యతరగతి వాసికి.. బడా బాబులు మాత్రం తమ హోదాని చాటి చెప్పుకోవడానికి ఖరీదైన వస్తువులను కొని ముచ్చట తీర్చుకుంటారు.. కోట్ల విలువ చేసే కార్లు, ఇళ్లు కొనుక్కుని వార్తల్లో నిలుస్తుంటారు.

మీరు చదివింది నిజమే.. ఆ ఇంటి ఖరీదు అదేనండి.. ఆ పెంట్ హౌస్ ఖరీదు 42 కోట్లో, 20 కోట్లో కూడా కాదు.. అక్షరాలా 420 కోట్లు. డబ్బులా చిల్ల పెంకులా.. కట్టేందుకు బ్రిక్స్ వాడాడా,, గోల్డ్ బిస్కట్లు వాడాడా అనే అనుమానం వస్తోంది కదూ.. రాదు మరీ.. 420 కోట్లంటే మాటలా.. ఏ అంబానికో అల్లుడైతే తప్ప అంత డబ్బు చూడ్డం చాలా కష్టం. ఇంతకీ ఆ రూ.420 కోట్ల ఇల్లు ఎక్కడ ఉందనుకుంటున్నారు.. హాంకాంగ్‌లో. అదేనండి చైనాకి దగ్గరలో.

ఇంత పెద్ద ఇంట్లో డజన్ల కొద్దీ బెడ్‌రూములు, బాత్రూములు గట్రా ఉన్నాయనుకుంటే పొరపాటే.. సింపుల్‌గా ఓ ఐదు బెడ్‌రూముల ఇల్లు అది. దాని కోసం ఆయన 59 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారట. అదే మన ఇండియన్ కరెన్సీలో అయితే దాదాపు రూ.420 కోట్లు. ఆసియాలో.. ఓ అపార్ట్‌మెంట్ మొత్తం కూడా కాదు.. పెంట్‌హౌస్ మాత్రమే.. ఈ స్థాయిలో అమ్ముడు పోవడం ఇదే తొలిసారి అని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. హాంకాంగ్ టైకూన్ విక్టర్ లి'స్ సీకే అస్సెట్ హోల్టింగ్స్‌కు చెందిన విలాసవంతమైన ఈ పెంట్‌హౌస్.. 21 బారెట్ రోడ్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో ఉంది.

ఇప్పుడీ ఫ్లాట్‌లో చదరపు అడుగు రికార్డు స్థాయిలో 17,500 డాలర్లకు అమ్ముడైంది. ఈ ప్రాజెక్టులోని 23వ అంతస్థులో ఉన్న ఈ పెంట్‌హౌస్‌ మొత్తం విస్తీర్ణం 3,378 చదరపు అడుగులు. విలాసవంతమైన సౌకర్యాలతో, కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతులతో పగలూ, రాత్రి పండు వెన్నెల అందాలను ఆ ఇంటిలో చూడొచ్చు. స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ టెర్రస్, మూడు పార్కింగ్ ప్లేసులు ఉన్న ఈ పెంట్ హస్‌ను ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. ఆ వ్యక్తి పేరును మాత్రం రహస్యంగా ఉంచారు.

ఐటీ వాళ్లకి తెలిస్తే ఇంకెంత సంపాదించావో బయటకి తీయ్ అంటారేమో అని భయపడ్డాడేమో.. చాలా దేశాల్లో ప్రభుత్వాలు ట్యాక్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తాయి. నిజానికి ప్రతి ఒక్కరూ ట్యాక్స్ పే చేస్తే ఆ దేశంలో పేదరికం అనేది ఉండదనేది ఆర్థిక నిపుణుల అంచనా. సరే.. అదలా ఉంచితే 2017లో కూడా ఇదే హాంకాంగ్‌లోని మౌంట్ నికోల్సన్‌లో ఓ లగ్జరీ ప్లాట్ భారీ ధరకు అమ్ముడైందట. ఆ సమయంలో అదే రికార్డు బ్రేక్.. ఇప్పుడు ఆ రికార్డుని ఈ పెంట్‌హౌస్ బద్దలు కొట్టింది. రూ.420 కోట్లకు అమ్ముడు పోయింది.

Tags

Read MoreRead Less
Next Story