కోవిడ్ భయం.. ఇద్దరి కోసం విమానంలోని టికెట్లన్నీ..

కోవిడ్ భయం.. ఇద్దరి కోసం విమానంలోని టికెట్లన్నీ..
అతని భార్య ఏకైక ప్రయాణీకులుగా ఉన్న విమాన ప్రయాణానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇండోనేషియాలోని జకార్తాలో ఉన్న సోషలిస్ట్ రిచర్డ్ ముల్జాది, అతని భార్య సురక్షితంగా బాలికి చేరుకునేందుకు మొత్తం విమానంలోని సీట్లన్నీ బుక్ చేసుకున్నాడు.

నిజానికి కోవిడ్ సమయంలో ప్రయాణాలంటే కొంత భయమే. తప్పని సరిగా ప్రయాణం చేయవలసి వస్తే మాస్క్, శానిటైజర్, దూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటాము. అంతే కానీ బస్సులోనో, రైల్లోనో నేనొక్కడినే కూర్చోవాలని అనుకోము. కానీ ఇక్కడ ఓ బడా బాబు విమానంలో ప్రయాణం చేయాలనుకున్నాడు.. అంత వరకు బాగానే ఉంది. విమానంలోని టికెట్టన్నీ తానొక్కడే కొనేసి హ్యాపీగా భార్యా భర్తలిద్దరూ ప్రయాణం చేశారు.

జకార్తాకు చెందిన సోషలిస్ట్ రిచర్డ్ ముల్జాది, అతని భార్య ఏకైక ప్రయాణీకులుగా ఉన్న విమాన ప్రయాణానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లగ్జరీ లైఫ్ స్టైల్ గడుపుతున్న రిచర్డ్ జతిర్తా నుండి బాలికి బాటిక్ ఎయిర్ విమానంలో ప్రయాణించాడు. అతను ఈ వారం ప్రారంభంలో తాను ఖాళీ విమానంలో కూర్చున్నట్లు చూపించే ఫోటోల వరుసను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

అయితే విమానానికి తాను ఎంత చెల్లించాడో వెల్లడించలేదు. రిచర్డ్ మాట్లాడుతూ, తాను మరియు అతని భార్య షాల్విన్ చాంగ్ ఈ వైరస్ బారిన పడటం గురించి "సూపర్ పారానోయిడ్" అని చెప్పారు.

విమానంలో ప్రయాణికులు రిచర్డ్, అతని భార్య మాత్రమే ఉన్నారని బాటిక్ ఎయిర్‌వేస్ నడుపుతున్న లయన్ ఎయిర్ గ్రూప్ ధృవీకరించింది. రిచర్డ్ రెండు టికెట్లను మాత్రమే బుక్ చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది. అంతకుముందు, తన పుట్టినరోజున తన పెంపుడు ఫ్రెంచ్ బుల్డాగ్‌కు కారును బహుమతిగా ఇచ్చాడు.

Tags

Read MoreRead Less
Next Story