నిజమా.. 160 టిక్కెట్లు గెలుచుకున్నానా: ఆశ్చర్యపోతున్న అదృష్టవంతుడు

నిజమా.. 160 టిక్కెట్లు గెలుచుకున్నానా: ఆశ్చర్యపోతున్న అదృష్టవంతుడు
అన్ని టికెట్లు 7314 నెంబర్లు ఉండేలా చూసుకున్నాడు.

ఓ పది టిక్కెట్లు కొంటే ఒక్కటైనా తగలకపోతుందా అని ఆశపడుతుంటారు.. లాటరీ టికెట్‌తో లక్కు మారుతుందని ఆశిస్తుంటారు. తాజాగా వర్జీనియాకు చెందిన ఓ వ్యక్తికి అదృష్టం బాగా పట్టుకుంది. ఒకటీ రెండూ కాదు ఏకంగా 160 లాటరీ టికెట్లు కొన్నాడు. ఒకటికి గెలిచినా సగం కష్టాల నుంచి గట్టెక్కొచ్చనుకున్నాడు క్యామే క్రాస్. అన్ని టికెట్లు 7314 నెంబర్లు ఉండేలా చూసుకున్నాడు. ఫలితాలు చూసి తనని తానే నమ్మలేకపోయాడు. ఎందుకంటే అన్ని సీరీస్‌ల్లోనూ అతడు టాప్ ఫ్రైజ్‌ను గెలుపొందాడు.

ఈ సందర్భంగా అతడు మొత్తం ఎనిమిది లక్షల డాలర్లు (రూ.5.89 కోట్లు) గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా క్యామే మాట్లాడుతూ నేను ఇది నిజమని నమ్మలేకపోయాను. ఎన్ని సార్లు చెక్ చేసుకున్నానో లెక్కలేదు. అస్సలు ఊహించలేకపోయా.. అని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. గతంలో కూడా రేమాండ్ హార్రింగ్టన్ అనే వ్యక్తి ఒకేసారి 25 లాటరీ టికెట్లు గెలుచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అయితే క్యామే అతడి కంటే ఎక్కువ లాటరీ టికెట్లు గెలుచుకున్న లక్కీ మ్యాన్ తానేనంటున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story