Manipur : బయోమెట్రిక్ డేటా సేకరణ షురూ

Manipur : బయోమెట్రిక్ డేటా సేకరణ షురూ
సెప్టెంబర్ లోగా అక్రమంగా వలసదారుల గణన పూర్తి

మణిపూర్ లో జరిగిన ఘోరమైన హింసకు మయన్మార్ నుండి వచ్చిన శరణార్థులతో పాటు నార్కో టెర్రరిజం కూడా కారణమని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం మయన్మార్ నుండి అక్రమంగా వలస వచ్చిన వారిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వారి బయోమెట్రిక్ డేటాను సేకరించడం మొదలుపెట్టింది. ఈ అల్లర్లకు వారికీ సంబంధం ఉందన్న కోణంలోనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు చెబుతోంది మణిపూర్ ప్రభుత్వం.

జాతుల మధ్యకర్షణలతో అట్టుడికి పోతున్న మానిపూర్ లో శాంతిని నిలిపేందుకు అధికారులు మణిపూర్లో రకరకాల దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. మయన్మార్ నుంచి అక్రమంగా ప్రవేశించిన వారికి గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. హోంశాఖ తెలిపిన వివరాల ప్రకారం మయన్మార్ నుండి అక్రమంగా వలసవచ్చిన వారి గణన సెప్టెంబర్ నెలాఖరుకల్లా పూర్తవుతుంది. ఈ మేరకు రాష్ట్ర అధికారులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు హోంశాఖ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుండి కేంద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని పంపినట్లు తెలుస్తోంది.


మణిపూర్ లో జరిగిన అలజడులలో కూకీలు అత్యధికంగా ఉండే కొండ ప్రాంతమైన చురాచంద్ పూర్ లో ఏడుగురు మయన్మార్ వలసదారులకు బులెట్ గాయాలు తగలడంతో అల్లర్లలో వారి పాత్ర ఉందనే అనుమానాన్ని మొదటిసారి వ్యక్తం చేసింది కేంద్రం. ఇదే అనుమానాన్ని పలువురు నేతలే కాదు మాజీ సైన్యాధిపతులు, భారతదేశంలోని ప్రసిద్ధ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు వంటివారు కూడా వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే వెంటనే స్పందించి మణిపూర్, మిజోరాం రాష్ట్రాల ప్రభుత్వాలను వెంటనే బయోమెట్రిక్ ఆధారంగా మయన్మార్ అక్రమ వలసదారుల గణన చేపట్టాలని అదేశించింది.మరోవైపు గత వారంలో రెండు రోజుల్లోనే 718 మంది అక్రమంగా ఈ రాష్ట్రంలో చొరబడటంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సరిహద్దు భద్రత బాధ్యతను నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్‌ను వివరణ కోరింది.

Tags

Read MoreRead Less
Next Story