FB Love : కాదు కాదు అంటూనే చిన్నది ..పాక్ లో పెళ్లి చేసుకున్నది

FB Love : కాదు కాదు అంటూనే చిన్నది  ..పాక్ లో పెళ్లి చేసుకున్నది
మతం మార్చుకుని..పెళ్లి చేసుకొని

ఛీ నేను సీమా లాంటి దాని కాదు.. నాది స్నేహమే.. పెళ్ళా అంత సీన్ లేదు అని బిల్డుప్ ఇచ్చింది.. ఇక్కడ ఆమె తండ్రేమో నా కూతురు చాలా మొండిది కానీ చెడ్డది కాదు అని చెబుతాడు.. భర్త నాకు అనుమానమే లేదని స్టేట్మెంట్.. మధ్యలో అందరూ ఫూల్స్ అయిపోయారు..

ఫేస్‌బుక్‌ స్నేహితుడిని కలిసేందుకు పాక్‌ వెళ్లిన 34 ఏళ్ల అంజూ.. 29 ఏళ్ల నస్రుల్లాఖాన్‌ను వివాహం చేసుకుంది. కట్టుకున్న భర్తనూ, కన్న బిడ్డలనూ కాదనీ ఖైబర్‌ పక్తున్వాలోని అప్పర్‌ దిర్‌ జిల్లాకు చెందిన నస్రుల్లాను నిఖా చేసుకుంది. పెళ్లికి ముందే మతం మారి ఇస్లాం స్వీకరించిన అంజూ.. తన పేరును ఫాతిమాగా మార్చుకుంది. పెళ్లి తర్వాత అంజూ,నస్రుల్లా కుటుంబీకులతో సహా స్థానిక కోర్టులో హాజరై తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఈ మేరకు వీడియోలు, ఫోటోలు మీడియాకు టిఫిన్లు, భోజనాలుగా పెట్టారు.

యూపీలో పుట్టిన అంజూకు రాజస్థాన్‌కు చెందిన అరవింద్‌తో పెళ్లయింది. 15 ఏళ్ల కుమార్తె, 6ఏళ్ల కుమారుడు ఉన్నారు. ఆమెకు మానసిక సమస్యలు ఉన్నాయి కానీ ప్రేమ వంటివి ఏం లేవని ఆమె తండ్రి గయా ప్రసాద్‌ థామస్‌ తెలిపాడు.

జూలై 21 అంజూ స్నేహితులను కలిసేందుకు జైపూర్ వెళ్తున్నానని భర్తకు అబద్ధం చెప్పి పాక్‌కు వెళ్లింది. లాహోర్‌కు వెళ్లినట్లు వాయిస్‌ కాల్‌ చేసి భర్తకు చెప్పింది. త్వరలో వచ్చి అన్ని విషయాలు చెబుతానందని ఆమె భర్త మీడియాకు తెలిపాడు. ఇన్నేళ్లలో అంజూపై ఒకసారి కూడా అనుమానం రాలేదని వివరించాడు. ఇక 2019లో అంజూకు ఫేస్‌బుక్‌లో నస్రుల్లాఖాన్‌ పరిచయమయ్యాడు. చాటింగ్‌లో పరిచయం ప్రేమగా మారింది. తరచూ వీడియోకాల్‌లు చేసుకున్నట్లు రాజస్థాన్‌ పోలీసులు గుర్తించారు. తామిద్దరం స్నేహితులం మాత్రమే అని.. పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు పాక్‌కు వచ్చినట్లు అంజూ కుటుంబీకులకు తెలిపింది. నస్రుల్లాఖాన్‌ కూడా తమ మధ్య ప్రేమ లేదని ఆమె తిరిగి భారత్‌కు వస్తుందని అన్నాడు .


అయితే సడన్ గా వారిద్దరి వీడియో బయటకు వచ్చింది.. ఫ్రీ వెడ్డింగ్ షూట్ లో పోస్ట్ వెడ్డింగ్ షూట్ తెలియదుగానీ ఇద్దరు కలిసి కలలలో విహరించినట్టుగా ఉంది ఆ వీడియో. మొత్తానికి కధ సుఖాంతమో కాదో తరువాత తెలుస్తుంది కానీ మొత్తానికి ఈ పెళ్లితో ఈ కధలో ఒక చాప్టర్ పూర్తి అయ్యింది. ఇక అంజు.. అదే అదే.. కొత్త పెళ్లికూతురు ఫాతిమా వీసా సంగతి ఏంటో వేచి చూడాలి మరి.

Tags

Read MoreRead Less
Next Story