Baltimore Incident: ఈ ఘటన.. ‘అమెరికా ఆర్థిక విపత్తు’

Baltimore Incident: ఈ  ఘటన.. ‘అమెరికా ఆర్థిక విపత్తు’
బాల్టిమోర్ వంతెన ప్రమాదంపై స్పందించిన మేరీల్యాండ్ గవర్నర్

కొద్ది రోజుల క్రితం జరిగిన బాల్టిమోర్‌ వంతెన ప్రమాదంతో స్థానిక నౌకాశ్రయంలో కార్యకలాపాలు నిలిచిపోయినట్టు మేరీల్యాండ్‌ గవర్నర్‌ వెస్‌ మూర్‌ వెల్లడించారు. ఈ పరిణామాలు కేవలం బాల్టిమోర్‌, మేరీల్యాండ్‌లకే పరిమితం కాదని అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ఘటనను ‘జాతీయ ఆర్థిక విపత్తు’గా అభివర్ణించారు.ఈ పరిణామాలు కేవలం బాల్టిమోర్‌, మేరీల్యాండ్‌లపైనే కాకుండా మొత్తం అమెరికాపైనా ఆర్థికపరంగా ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనను ‘జాతీయ ఆర్థిక విపత్తు’గా పేర్కొన్నారు. గతవారం బాల్టిమోర్‌లోని పటాప్‌స్కా నదిపై ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెనను నౌక ఢీకొట్టి కూలిపోయిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే పోర్టుల్లో ఒకటైన బాల్టిమోర్‌లో కార్యకలాపాలు నిలిచిపోయాయి.

‘అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే ఓడరేవుల్లో బాల్టిమోర్‌ ఒకటి.. గతేడాది ఈ పోర్టు నుంచి 11 లక్షల కంటెయినర్లు వెళ్లాయి.. కార్లు, ట్రక్కులు, వ్యవసాయ పరికరాల ఎగుమతులకు దేశవ్యాప్తంగా ఇదే అతిపెద్ద ఓడరేవు.. వంతెన కూలి ప్రస్తుతం కార్యాకలాపాలు నిలిచిపోవడంతో.. దీని ప్రభావం కేవలం మేరీల్యాండ్‌కే పరిమితం కాదు. కెంటకీలో రైతులు, ఒహియోలో ఆటో డీలర్లు, టెనెస్సీలో రెస్టారెంట్‌లపైనా కూడా ప్రభావం పడుతుంది.. ఈ నౌకాశ్రయం దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకం. అందుకే వీలైనంత త్వరగా రాకపోకలు పునరుద్ధరించడం అవసరం... బాల్టిమోర్ నౌకాశ్రయం మా ఆర్థికవృద్ధికి దోహదపడుతుంది.. అమెరికా ఆర్ధిక వ్యవస్థ మళ్లీ ముందుకెళ్లేందుకు సత్వర చర్యలు తీసుకున్నామని నిర్ధరించుకోవాలి’ అని వెస్‌ మూర్‌ పేర్కొన్నారు.

నౌక ఢీకొనడంతో పటాప్‌స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్‌ స్కాట్‌ కీ వంతెన మొత్తం కుప్పకూలిన విషయం తెలిసిందే. అమెరికా కాలమానం ప్రకారం.. మార్చి 25న అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగింది. నౌకలో భారత సిబ్బంది ఉన్నారు. అయితే.. ప్రమాదానికి ముందే వారు అధికారులను అప్రమత్తం చేయడంతో వంతెనపై రాకపోకలను నిలిపేయగలిగారు. వారి అప్రమత్తత ఎన్నో ప్రాణాలను కాపాడిందని వెస్‌ మూర్‌ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సైతం భారత సిబ్బందిపై ఇప్పటికే ప్రశంసలు కురిపించారు.

Tags

Read MoreRead Less
Next Story