స్థానికులను భయపెడుతున్న భారీ సింక్ హోల్.. రోజు రోజుకి..

స్థానికులను భయపెడుతున్న భారీ సింక్ హోల్.. రోజు రోజుకి..
నేను వెళ్లి చూసినప్పుడు భూమి ముక్కలుగా హోల్ లోకి విరిగి పడుతుంటే చూసి భయపడ్డాను, ”అని ఆ ప్రాంత నివాసి మాగ్డలీనా స్థానిక మీడియాతో మాట్లాడుతూ వివరించింది.

భూగర్భజలాలతో నిండిన 60 అడుగుల లోతులో ఉన్న సింక్‌హోల్ దగ్గరకు వెళ్లవద్దని అధికారులు స్థానికులను కోరారు.

మెక్సికో ప్యూబ్లా రాష్ట్రంలోని ఒక వ్యవసాయ భూమిలో సుమారు 300 అడుగుల వ్యాసం కలిగిన ఒక భారీ సింక్‌హోల్ ఏర్పడింది. వారం రోజుల క్రితం స్థానికులు దీనిని గుర్తించారు. ఆ రోజు నుంచి వేగంగా విస్తరిస్తూనే ఉన్న ఈ రంధ్రం సమీపంలోని ఇంటి వారిని భయపెడుతోంది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఆ ఇంటిలోని వారిని ఖాళీ చేయించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన భారీ సింక్ హోల్ చిత్రాలు, వీడియోలు నెటిజన్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

న్యూ యార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం పరిశోధకులు ఈ ప్రాంతాన్ని సురక్షితంగా భావించే వరకు ఈ సింక్ హోల్ సమీపంలో ఉన్న గృహాలను ఖాళీ చేయించారు. సింక్‌హోల్ కనిపించే ముందు పెద్ద శబ్దం వినిపించిందని ఈ ప్రాంతంలో నివసిస్తున్న స్థానికులు తెలిపారు. "6 గంటలకు భారీ శబ్ధం వినిపించింది. అది ఇదేనని మేము అనుకోలేదు, తరువాత నా అత్తమామలు దానిని గుర్తించారు. నేను వెళ్లి చూసినప్పుడు భూమి ముక్కలుగా హోల్ లోకి విరిగి పడుతుంటే చూసి భయపడ్డాను, "అని ఆ ప్రాంత నివాసి మాగ్డలీనా స్థానిక మీడియాతో మాట్లాడుతూ వివరించింది.

అంతేకాకుండా, సింక్ హోల్‌కు చాలా దగ్గరగా ఉన్నందున వెంటనే ఖాళీ చేశాము అని మాగ్డలీనా చెప్పారు. మా ఇల్లు కూడా సింక్ హోల్ లో పడిపోతుందని ఆందోళనగా ఉంది. ఎందుకంటే మేము మా ఇంటిని చాలా కష్టపడి నిర్మించుకున్నాము అని ఆమె ఆవేదన చెందుతోంది.

Tags

Read MoreRead Less
Next Story