పార్క్ చేసిన కారు.. సడెన్‌గా రోడ్డు కుంగడంతో..

పార్క్ చేసిన కారు.. సడెన్‌గా రోడ్డు కుంగడంతో..
ఆరెంజ్ టయోటా RAV4 అనే వాహనం గురువారం తెల్లవారుజామున క్వీన్స్‌లోని సింక్‌హోల్‌లో పడిపోయింది.

ఓ పక్క థాంక్స్ గివింగ్ డే సెలబ్రేషన్స్‌‌ లో న్యూయార్క్ నగరం మునిగిపోయింది. మరో పక్క రోడ్డు మీద ఆగి ఉన్న ఆరెంజ్ టయోటా RAV4 అనే వాహనం గురువారం తెల్లవారుజామున క్వీన్స్‌లోని సింక్‌హోల్‌లో పడిపోయింది. అదృష్టవశాత్తూ సింక్‌హోల్‌లో వాహనం పడిపోయినప్పుడు యజమాని దాని లోపల లేడు. దీంతో అతడు అతి పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పాడు.

"నేను ఈ రోజు అదృష్టవంతుడిని" అని తుప్టెన్ టాప్జీ చెప్పారు, అతడి డ్యూటీ షిఫ్ట్ సాధారణంగా ఆ సమయంలోనే ప్రారంభమవుతుంది. రోడ్డు కుంగిపోవడంతో ఆ ఏరియాలోని కొన్ని వీధులను మూసివేసినట్లు సిటీ కౌన్సిలర్ రాబర్ట్ హోల్డెన్ వెల్లడించారు. కుంగిన రోడ్డులో పడిపోయిన కారు ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. న్యూయార్క్ నగర అగ్నిమాపక విభాగం మరియు నగర పోలీసు విభాగం ఇద్దరూ సంఘటన స్థలానికి చేరుకున్నారు, కారుకు ఎటువంటి డ్యామేజ్ జరగలేదని నిర్ధారించారు.

సింక్ హోల్ తెరుచుకోవడానికి గల కారణమేమిటో స్పష్టంగా తెలియలేదు. న్యూయార్క్ నగరంలో సింక్‌హోల్ తెరవడం ఇదే మొదటిసారి కాదు. 2015 లో ఇదే విధమైన సంఘటన జరిగింది.

Tags

Read MoreRead Less
Next Story