Meta Payouts : ఉద్యోగుల బోనస్ ను తగ్గించిన మెటా

Meta Payouts : ఉద్యోగుల బోనస్ ను తగ్గించిన మెటా

ఉద్యోగుల బోనస్ ను తగ్గించింది సోషల్ మీడియా దిగ్గజం మెటా. పనితీరు అంచనావేసి బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. సంవత్సరంలో రెండుసార్లు ఉద్యోగుల పనితీరును పరిగణలోకి తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. బోనస్ ను 85 శాతం నుంచి 65శాతానికి తగ్గించినట్లు మెటా ప్రతినిధులు తెలిపారు. ఈ నిర్ణయం కొంతమంది ఉద్యోగులకు నిరాశపరచవచ్చనీ... అయినప్పటికీ, అధిక పనితీరుతో పాటు సంవత్సరానికి రెండు సార్లు ఉద్యోగుల పనితీరును అంచనా వేయనున్నామని చెప్పారు. ఇందుకుగాను ఓ ప్రకటనను విడుదల చేసింది మెటా.


"ఇది కొంతమంది ఉద్యోగులకు నిరాశపరిచే ముఖ్యమైన మార్పు... అయినప్పటికీ, అధిక-పనితీరు గల సంస్కృతిని కొనసాగించడంపై మా దృష్టి ఉంది. ఇది సంస్థకు మేలు చేస్తుందని అర్థం చేసుకున్నాము" అని స్పష్టం చేశారు. సిబ్బంది పనితీరును సంవత్సరానికి రెండుసార్లు అంచనా వేయడం కూడా ప్రారంభించనున్నట్లు నివేదిక పేర్కొంది. మార్చి 14న, కంపెనీ 5,000 ఓపెనింగ్‌ల కోసం నియామక ప్రణాళికలను స్క్రాప్ చేయడం, తక్కువ-ప్రాధాన్యత గల ప్రాజెక్ట్‌లను ముగించడం, మధ్యస్థ ప్రాజెక్ట్ లను ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. రెండవ రౌండ్ తొలగింపులలో భాగంగా.. ఈ సంవత్సరం 10,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. నిర్వహణ, పరిశ్రమ తీవ్ర ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story