Mayor weds Crocodile: మొసలితో మనువు

Mayor weds Crocodile: మొసలితో మనువు
సంప్రదాయ వేడుకలో భాగంగా ఆడ మొసలిని పెళ్లాడిన మెక్సికో టౌన్ మేయర్

అతను ఒక నగరానికి మేయర్. ఇష్టపడ్డాడో, కష్టపడ్డాడో తెలియదు కానీ తాము ప్రేమలో ఉన్నానని అందరి ముందు అనౌన్స్ చేసాడు. కట్ చేస్తే.. ఓ మొసలిని పెళ్లి చేసుకున్నాడు. మెక్సికోలో జరిగిన ఈ కధేంటో తెలుసా

తెల్లని వెడ్డింగ్ ఫ్రాక్ ధరించి పాక్కుంటూ వచ్చింది ఆ అందమైన ఆడ మొసలి. దానిని ప్రేమగా చేతుల్లోకి తీసుకుని ఆనందంగా నాట్యం చేస్తూ పెళ్లి చేసుకున్నట్టు అతిథులు, సన్నిహితులు, బంధువులకు ప్రకటించాడు మేయర్.

మెక్సికోలోని సాన్ పెడ్రో హువా మెలులా మేయర్ విక్టర్ హ్యూగో సోనా, అలిసియా అడ్రియానా అనే ఒక ఆడ మొసలిని పెళ్లి చేసుకున్నారు. మేయర్ ఛోంతాల్ తెగకు చెందిన వారు. ఈ తెగలో పాలకులు ఆడ మొసలిని పెళ్లాడడం సంప్రదాయంగా కొనసాగేది. తమ పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో గడపాలని, వారికి అదృష్టం కలగాలని కోరుకుంటూ ఛోంతాల్ తెగ రాజులు ఈ తంతు నిర్వహించేవారు. ఇప్పుడు మేయర్ తన పట్టణ ప్రజలకు అదృష్టం తీసుకురావాలనే ఉద్దేశంతో మొసలిని పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్నారు. వివాహ వేడుకకు ముందు అలిసియా అడ్రియానా అనే మొసలిని ఇంటింటికీ తీసుకు వెళ్లారు. ఇక అక్కడివారంతా ఆమెను తమ చేతుల్లోకి తీసుకుని డాన్స్ చేశారు .అప్పుడు దానికి వారి సంప్రదాయం అయిన ఆకుపచ్చటి స్కర్ట్ , రంగురంగుల హ్యాండ్ ఎంబ్రాయిడరీ ట్యూనిక్ ను వేశారు.





తరువాత దానిని వైట్ ఫ్రాక్ తో అందంగా రెడీ చేశారు. టౌన్ హాల్ కు తీసుకువెళ్ళి పెళ్లి కుమారుడి చేతిలో పెట్టారు. ఈ సందర్బంగా మేయర్ సోనా మేము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం కాబట్టి నేను ఆమెను వివాహం చేసుకుని తన బాధ్యతను స్వీకరిస్తాను అంటూ ప్రమాణం చేశారు. వివాహ తంతు ముగిసిన తర్వాత సాంప్రదాయబద్ధమైన సంగీతానికి వధూ వరులు నాట్యం చేశారు. ఒకప్పుడు రెండు స్వదేశీ సమూహాల ఘర్షణల సమయంలో, కొంతకాలానికి వారికి సయోధ్య ఏర్పడి శాంతికి వచ్చిన రోజును గుర్తు చేసుకోవడానికి ఒక పురుషుడికి, ఆడ మొసలికి వివాహం జరిపించడం 230 సంవత్సరాలుగా మెక్సికో లో కొనసాగుతున్న సాంప్రదాయం. అందులో భాగంగానే ఈ వివాహం జరిగిందని ఇక్కడి పెద్దలు చెబుతున్నారు.

అన్నట్టు ఈ వివాహానికి ముందు మొసలి వల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా నివారించడానికి మొసలి మూతికి ప్లాస్టర్ వేశారు.

Tags

Read MoreRead Less
Next Story