Mexico : పోలీసు కాన్వాయ్‌ పై బుల్లెట్లు

Mexico : పోలీసు కాన్వాయ్‌ పై బుల్లెట్లు
13 మంది పోలీసులు సహా మొత్తం 17 మంది మృతి

మెక్సికోలో సోమ‌వారం దారుణం జ‌రిగింది. పోలీసు కాన్వాయ్‌పై గుర్తు తెలియ‌ని దుండ‌గులు తుపాకుల‌తో విరుచుకుప‌డ్డారు. పోలీసుల‌పై బుల్లెట్ల వ‌ర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో 13 మంది పోలీసులు దుర్మ‌ర‌ణం చెందారు. ఈ కాల్పుల ఘ‌ట‌న మెక్సికోలోని గురెరో రాష్ట్రంలోని కోయుక డి బెనిటెజ్ న‌గ‌రంలో చోటు చేసుకున్న‌ట్లు పోలీసులు ధృవీక‌రించారు. ఈ ఘటన దక్షిణ రాష్ట్రమైన గెరెరోలోని కొయుకా డి బెనిటెజ్ మునిసిపాలిటీలో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది.

జాతీయ భ‌ద్ర‌తా విభాగానికి చెందిన ఓ సీనియ‌ర్ అధికారి ప్ర‌యాణిస్తోన్న కాన్వాయ్‌ను ల‌క్ష్యంగా చేసుకుని దుండ‌గుల‌కు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ కాల్పుల్లో సీనియ‌ర్ అధికారి మృతి చెందాడా..? లేదా..? అనే విష‌యంపై పోలీసులు ఇంకా స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. అయితే అతను మరణించే ఉంటారని సమాచారం.


ఈ ఘటనపై అలెజాండ్రో హెర్నాండెజ్‌ అనే అధికారి మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణ ప్రకారం గుర్తు తెలియని దుండగులు పోలీసుల కాన్వారు పై కాల్పులు జరపడంతో 13 మంది మున్సిపల్‌ పోలీసులు మరణించారని తెలిపారు. దాడి చేసిన వారిని డ్రగ్‌ సరాఫరా చేసే ముఠాగా అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మెక్సికో డ్రగ్స్ కేసులతో అల్లాడుతున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్‌పై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం 2006లో సైన్యాన్ని మోహరించింది. అయితే..సైన్యం మోహరించినప్పటి నుండి, 420,000 కంటే ఎక్కువ మంది ప్రజలు చంపబడ్డారు. మాదక ద్రవ్యాల రవాణాదారులు,భద్రతా దళాల మధ్య ఘర్షణ కారణంగా మెక్సికోలోని అత్యంత హింసాత్మక ప్రాంతాలలో గెరెరో ఒకటిగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story