Mexico bus crash: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం... 18మంది మృతి

Mexico bus crash: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం... 18మంది మృతి
బస్సులో మొత్తం 40 ప్రయాణికులు.. అందులో ఆరుగురు భారతీయులు...

పశ్చిమ మెక్సికోలోని నయరిట్‌(Nayarit ) రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం‍(Mexico bus crash)‌లో 18 మంది దుర్మరణం పాలయ్యారు. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు జాతీయ రహదారి నుంచి లోయలోకి‍(Fell Down Ravine In Mexico)‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 22 మంది గాయపడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు భారతీయులు( 6 Indians Onboard Bus) ఉన్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. వారి పరిస్థితిపై స్పష్టమైన సమాచారం ఇంకా తెలియలేదు. రోడ్డు ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు తక్షణ సహాయ చర్యలు చేపట్టారు.


టిజువానా వైపు వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తూ 164 అడుగుల లోతున్న లోయలో పడిపోయిందని మెక్సికో పౌర రక్షణ కార్యదర్శి జార్జ్ బెనిటో రోడ్రిగ్జ్ చెప్పారు. బాగా లోతున్న లోయలో పడిపోవడం వల్ల రెస్య్కూ ఆపరేషన్‌ కష్టమైనట్లు తెలిపారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


బస్సు లోయలోకి దూసుకెళ్లడానికి గల కారణాలు తెలియరాలేదు. గత నెలలో సైతం మెక్సికోలోని ఓక్సాకాలో జరిగిన బస్సు ప్రమాదంలో 29 మంది మృతిచెందారు.

Tags

Read MoreRead Less
Next Story