Mexico: బస్సు, ట్రక్కు ఢీ.. 19 మంది మృతి

Mexico: బస్సు, ట్రక్కు ఢీ.. 19 మంది మృతి
మెక్సికోలో ఘోర రోడ్డుప్రమాదం..

ఉత్తర మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ వెస్ట్రన్ సినాలోవా రాష్ట్రంలో డబుల్ డెక్కర్ బస్సు, గూడ్స్ ట్రక్కు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో 19మంది మరణించగా.. మరో 18మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం సమయంలో బస్సులో 37మంది ప్రయాణిస్తున్నారు. మజాట్లాన్, లాస్ మోచిస్ నగరాల మధ్య కోస్టల్ హైవేపై ప్రయాణిస్తున్నక్రమంలో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదం తరువాత హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

బస్సు, గూడ్స్ ట్రక్కు ఢీకున్నవెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు మంటల్లో పూర్తిగా దగ్దమైంది. ప్రమాదం సమాచారం అందిన వెంటనే అత్యవసర బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సినలోవా అటార్నీ జనరల్ సారా క్వినోనెజ్ విచారం వ్యక్తం చేశారు. దీనిని సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారని, చనిపోయినవారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇక, ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్దారించారు. ప్రమాద తీవ్రతకు బస్సు నుజ్జునుజ్జయ్యింది.

ప్రమాదానికి గురైన బస్సు జలిస్కో రాష్ట్రంలోని గ్వాడలజార నగరం నుంచి సినలోవాలోని లాస్ మోచిస్‌కు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. ట్రక్కు, బస్సులో దాదాపు 50 మంది ఉన్నట్టు చెప్పారు. ఢీకొట్టిన తర్వాత బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైంది. మెక్సికోలో ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణం. అతివేగం, వాహనాల కండిషన్ లేదా డ్రైవర్ల అలసత్వం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. గతేడాది జులైలో ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు కొండ ప్రాంతంలో ప్రమాదానికి గురై 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కాలంలో అక్కడ జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదం ఇదే.

Tags

Read MoreRead Less
Next Story