Red Wine: రెడ్ వైన్ వరద..

Red Wine:  రెడ్ వైన్  వరద..
తాగొచ్చు.. స్నానం చెయ్యొచ్చు కూడా ..

అక్కడ రెడ్ వైన్ వ‌ర‌ద‌లై పారింది. రోడ్లన్నీ రక్తపుటేరుల్లా కనిపించాయి. అయితే అది రక్తమో, ఇంకేదో కాదు కాబట్టి జనాలు చక్కగా మంచి ప్లేస్ చూసుకొని గ్లాస్ పట్టుకొని పార్టీ చేసుకున్న సంఘటన పోర్చుగ‌ల్‌లోని సావో లోరెంకో డీ బైరో వీధుల్లో జరిగింది. ఆ చిన్న ప‌ట్ట‌ణంలో ఉన్న వీధుల‌న్నీ మిలియ‌న్ల లీట‌ర్ల రెడ్ వైన్‌తో నిండిపోయాయి. వీధుల వెంట వైన్ ప‌రుగులు తీసింది. ఎత్తైన ప్ర‌దేశం నుంచి కింద ఉన్న వీధుల దిశ‌గా ఆ వైన్ పారింది. ప‌ట్ట‌ణంలో ఉన్న ఓ డిస్టిల్ల‌రీ నుంచి ఆ వైన్ వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు.

దాదాపు రెండు మిలియ‌న్ల లీట‌ర్ల రెడ్ వైన్‌ బ్యార‌ళ్లు పేల‌డంతో వైన్ వ‌ర‌ద‌లా ప్ర‌వహించింది. సుమారు ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ అంత వైన్ నేల‌పాల‌య్యింది. అగ్నిమాప‌క శాఖ రంగంలో దిగి ఆ వైన్ ప్ర‌వాహాన్ని ఆపే ప్ర‌య‌త్నం చేసింది. స‌మీపంలో ఉన్న సెర్టిమా న‌దిలోకి ఆ వైన్ వెళ్లి కలిసింది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల లెవిరా డిస్టిల్ల‌రీ క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. ఆ ప్ర‌వాహం వల్ల క‌లిగిన న‌ష్టాన్ని పూడ్చ‌నున్న‌ట్లు ఆ కంపెనీ తెలిపింది. క్లీనింగ్ ప్ర‌క్రియ కూడా చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపింది. పోర్చుగల్‌లోని ఒక చిన్న పట్టణం సమీపంలోని డిస్టిలరీలో జరిగిన ప్రమాదం కారణంగా రెడ్ వైన్ రోడ్లపై భారీ వరదగా మారింది.


డిస్టిలరీకి చెందిన రెండు రెడ్ వైన్ ట్యాంకులు పేలి వాటిలో ఉన్న వైన్ వీధుల్లోకి వెళ్లింది. 2.2 మిలియన్ లీటర్ల రెడ్ వైన్‌ వరదలా పారింది. రెడ్ వైన్ వరద పట్టణాన్ని ముంచెత్తింది. లీకైన వైన్ పరిమాణం దాదాపు 20 లక్షల లీటర్లు (2.2 మిలియన్ లీటర్లు) ఉంటుందని, దాదాపు 20 లక్షల వైన్ బాటిళ్ల సామర్థ్యం కలిగి ఉంటుందని ఆ దేశ పత్రికలు అంచనా వేస్తున్నాయి. పట్టణంలోని సెర్టిమా నదిలో ప్రవహించే ప్రమాదం ఉందని ఆ ప్రాంత వాసులు భయాందోళన వ్యక్తం చేశారు. అయితే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఆ ప్రవాహాన్ని అడ్డుకుని అక్కడి పొలంలోకి మళ్లించారు.

ఈ దురదృష్టకర సంఘటనకు, దాని వల్ల జరిగిన నష్టానికి తామే బాధ్యులమని, పట్టణాన్ని శుభ్రం చేయడానికి అయ్యే పూర్తి ఖర్చును భరిస్తామని డిస్టిలేరియా లెవిరా పేర్కొంది. సోషల్ మీడియాలో వీడియో చూసిన మద్యం ప్రేమికులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.



Tags

Read MoreRead Less
Next Story