Miss Netherlands 2023: మిస్ నెద‌ర్లాండ్స్ గా ట్రాన్స్‌జెండ‌ర్

Miss Netherlands 2023:  మిస్ నెద‌ర్లాండ్స్ గా ట్రాన్స్‌జెండ‌ర్
అందాల పోటీల్లో తొలిసారిగా కిరీటం దక్కించుకున్న ట్రాన్స్‌జెండర్‌

సమాజంలో ఉన్నత హోదాలో ఉండి కూడా త‌గిన గౌర‌వం ద‌క్క‌ని ఓ వర్గం ట్రాన్స్‌జెండ‌ర్స్‌. వారిని ఈ స‌మాజం ఎప్పుడూ తక్కువ చూపు చూస్తుందనేది అంగీకరించలేని నిజం. వారిని హేళన చెయ్యటం, చిన్న తప్పులకే వారిపై భౌతిక దాడులకు దిగటం కూడా మనం చూస్తుంటాం.. ఆఖరికి కన్నవారు కూడా వారిని వదిలించుకుంటేనే మంచిదని భావించే పరిస్థితి ఉంది.

కానీ ఇప్పుడు రోజులు కాస్త మారాయనే చెప్పచ్చు. ఇప్పుడు వారు చాలా రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో తామేంటో నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా తొలిసారి మిస్ నెద‌ర్లాండ్స్ టైటిల్‌ను ఓ ట్రాన్స్ జెండర్ మహిళ గెల్చుకుంది.



మిస్ నెదర్లాండ్స్ టైటిల్ ని తొలిసారిగా ట్రాన్స్ జెండర్ మహిళ రిక్కీ వలెరీ కొల్లే గెల్చుకుంది. ఎంతోమంది అందెగత్తెలు ఈ పోటీల్లో పాల్గొనగా ఓ ట్రాన్స్ జెండర్ మహిళ మిస్ నెదర్లాండ్స్ టైటిల్ ని దక్కించుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. టైటిల్ గెల్చుకున్న తర్వాత రిక్కీ తన ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ద్వారా వ్యక్తం చేసింది. 22 ఏళ్ల రిక్కీ వలెరీ కొల్లే పోటీల్లో మోడల్స్ ని ఓడించి తన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ మధుర క్షణాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను.. ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది అంటూ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను అప్ లోడ్ చేసింది అమస్టర్ డామ్ లో జరిగిన కార్యక్రమంలో విజేతగా నిలిచిన రిక్కీ ఎల్ సాల్వాడార్ లో జరగబోయే 72వ మిస్ యూనివర్స్ పోటీలకు రిక్కీ ఎంపికైంది.

రిక్కీ జన్మతహ పురుషుడిగా పుట్టింది. తరువాత 16 సంవత్సరాల వయసుల్లో పూర్తి మహిళగా మారింది. తాను ఎంతోమందికి రోల్ మోడల్ కావాల‌నుకుంటున్న‌ట్లు చెబుతున్న రిక్కీ తమపై చూపించే వివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా పోరాడ‌నున్న‌ట్లు తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story