విడాకులు తీసుకున్న మహిళ అందాల పోటీకి అర్హురాలు కాదంటూ.. స్టేజ్ పైనే..

విడాకులు తీసుకున్న మహిళ అందాల పోటీకి అర్హురాలు కాదంటూ.. స్టేజ్ పైనే..
మిసెస్ శ్రీలంక అందాల పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈసారి అందాల కిరీటం ఎవరిని వరించనుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మిసెస్ శ్రీలంక అందాల పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈసారి అందాల కిరీటం ఎవరిని వరించనుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనంతరం కొద్ది సేపటికే మిసెస్ పుష్పికా డి సిల్వా పేరు ప్రకటించి కిరీటాన్ని అందించింది జ్యూరీ. మిసెస్ శ్రీలంక కిరీటాన్ని ధరించిన పుష్పిక అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ స్టేజ్‌పైన కొద్ది సేపు వాక్ కూడా చేశారు.

కానీ అంతలోనే మిసెస్ వరల్డ్‌ మరియు 2019లో మిసెస్ శ్రీలంక కిరీటాన్ని గెలుచుకున్న కరోలిన్ జ్యూరీ సభ్యులు ఊహించని పని చేసి అందరి ఆగ్రహానికి గురయ్యారు. ఆమె వేదిక మీద కిరీటాన్ని అలంకరించిన పుష్పిక వద్దకు వెళ్లి నువ్వు విడాకులు తీసుకున్నావు.

విడాకులు తీసుకున్న మహిళలు అందాల పోటీలకు అర్హులు కారు అంటూ ఆమె పుష్పిక తలపై ఉన్న కిరీటాన్ని తీసి మొదటి రన్నరప్‌కు ఇచ్చింది. దీంతో అవమానంగా భావించిన పుష్పిక అక్కడి నుంచి వడివడిగా నడుచుకుంటూ కిందకు వెళ్లి పోయింది.

పుష్పిక నుంచి కిరీటాన్ని తీసే క్రమంలో ఆమె తలకు గాయాలయ్యాయి. ఫేస్‌బుక్ ద్వారా వివరణ ఇచ్చిన పుష్పిక నేను విడాకులు తీసుకున్న మహిళను కాదు. ఒకవేళ విడాకులు తీసుకుని ఉంటే నా విడాకుల పత్రాలను సమర్పించమని వారికి సవాలు చేస్తున్నాను అని ఆమె రాసుకొచ్చారు. ఈ చర్యను నేను చాలా అవమానంగా భావిస్తున్నాను. ఆమెపై కేసు వేస్తానని ఆవేదనగా అన్నారు.

దీని తరువాత, జ్యూరీ అధికారులు శ్రీమతి డి సిల్వా విడాకులు తీసుకోలేదని, కిరీటం ఆమెకు తిరిగి ఇస్తామని ధృవీకరించారు. "కరోలిన్ జ్యూరీ వేదికపై అలా ప్రవర్తించడం అవమానకరం" అని మిసెస్ వరల్డ్ సంస్థ ఇప్పటికే ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించిందని అన్నారు.



Tags

Read MoreRead Less
Next Story