Indonesia : మిస్ ఇండోనేషియా పోటీలు రద్దు

Indonesia : మిస్ ఇండోనేషియా పోటీలు రద్దు
లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఇండోనేషియా ఆర్గనైజర్స్ ఫ్రాంచైజీ రద్దు

లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఇండోనేషియా ఆర్గనైజర్స్ యొక్క ఫ్రాంచైజీ రద్దు చే సినటు మిస్ యూనివర్స్ ప్రకటించింది. ఈ సంస్థ తమ ప్రమాణాలకు, నైతికతకు అనుగుణంగా లేదని చెప్పింది. మిస్ ఇండోనేషియా యూనివర్స్ పోటీకి చెందిన ఆరుగురు పోటీదారులు తమపై నిర్వాహకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కొన్ని రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోటీ సమయంలో తాము టాప్‌లెస్ ‘బాడీ చెక్’లకు గురయ్యామని వారు ఆరోపించారు.

రాజధాని జకార్తాలో జులై 29 నుండి ఆగస్టు 3 వరకు మిస్ ఇండోనేషియా యూనివర్స్ అందాల పోటీలు జరిగాయి. పురుషులతో సహా 20 మంది కంటే ఎక్కువ మంది ఉన్న గదిలో భౌతిక తనిఖీ కోసం ఐదుగురిని లోదుస్తులను విప్పమని నిర్వాహకులు కోరారని పోటీదారులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


మరోవైపు ఈ విషయయాన్ని మిస్ యూనివర్స్ పోటీకి సంబంధించి నిర్వాహకులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఇండోనేషియా ఆర్గనైజర్స్ ను మిస్ యూనివర్స్ ఫ్రాంచైజీ రద్దు చేసుకున్నట్టుగా ప్రకటించారు. అంతే కాదు ఇండోనేషియా ఫ్రాంచైజీప లైసెన్స్ కలిగి ఉన్న కారణంగా మిస్ యూనివర్స్ మలేషియా కూడా రద్దు చేసినట్టు ప్రకటించారు. అందాల పోటీలలో శారీరక మానసిక హింసను ఎట్టి పరిస్థితులను అంగీకరించమని చెప్పిన ఈ సంస్థ నిర్వాహకులు ఆ సంస్థ తో ఇండోనేషియా ఆర్గనైజర్స్ తో సంబంధాలు తెంచుకుంటున్నట్టుగా చెప్పారు. ఈ నేపథ్యంలో కాపెల్లా స్వస్తిక్ డైరెక్టర్ పాపీ కాపెల్లా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటన చేశారు. లైంగిక వేధింపులకు తాను పూర్తి వ్యతిరేకినని, తను ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనలేదు సరి కదా, తప్పకుండా అభ్యంతరం చెబుతానని చెప్పారు.

ఈ ఏడాది చివర్లో ఎల్ సాల్వడార్‌లో జరిగే వార్షిక మిస్ యూనివర్స్ పోటీకి ఇండోనేషియా ఎంట్రీని ఎంపిక చేయడానికి జకార్తాలో పోటీ జరిగింది. 1996- 2002 మధ్యకాలంలో డొనాల్డ్ ట్రంప్ సహ-యాజమాన్యంలో ఉన్న మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న పోటీ 1952 నుంచి నడుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story