Mozambique : ప్రాణం తీసిన కలరా భయం నీట మునిగి 90 మంది మృతి..

Mozambique : ప్రాణం తీసిన కలరా భయం  నీట మునిగి   90 మంది మృతి..

ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో తివ్ర విషాదం చోటుచేసుకున్నది. మొజాంబిక్‌ ఉత్తర తీరప్రాంత సముద్రంలో ప్రమాదవశాత్తు మత్స్యకార పడవ మునిగిపోవడంతో 90 మందికిపైగా మరణించారు. ప్రమాద సమయంలో అందులో 130 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫెర్రీని చేపల పడవగా మార్చి సామర్థ్యానికి మించి ప్రయాణించడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని నాంపుల ప్రావిన్స్‌ సెక్రటరీ జైమ్‌ నెటో చెప్పారు.

కలరా వ్యాప్తి అంటూ వదంతులు రావడంతో ప్రజలు తప్పించుకుని దీవులోకి వెళ్తున్నట్లు నాంపుల ప్రావిన్స్ సెకట్రీ జైమ్ నెటో వెల్లడించారు. ఇలా వెళ్తుండగా పదబ మునిగిందంటున్నారు. మొజాంబిక్ దేశంలో 2023 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 15వేల కలరా కేసులు నమోదైనట్లు అధికారిక రిపోర్ట్స్ చెబుతున్నాయి. రిపోర్టుల ప్రకారం.. కలరాతో 32 మంది మరణించారు.

విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఐదు మృతదేహాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. సముద్రంలో ప్రతికూల పరిస్థితుల కారణంగా మృతదేహాల వెలికితీత కష్టంగా మారిందని అధికారులు పేర్కొన్నారు. బోటులో పరిమితి కన్నా ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉండటం తోనే ప్రమాదం సంభవించినట్లు, ఈ ప్రమాదంలో 91 మంది ప్రాణాలు కోల్పోయారని నంపులా రాష్ట్ర కార్యదర్శి జైమ్ నెటో వెల్లడించారు. స్థానికంగా కలరా వ్యాప్తిచెందుతుందంటూ వదంతులు రావడంతో ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలు తప్పించుకొని దీవుల్లోకి వెళుతుండగా ఈ పడవ మునిగిందని ఆయన తెలిపారు.



Tags

Read MoreRead Less
Next Story